గన్నవరం నుంచి దుబాయ్ కి డైరెక్ట్ ఫ్లైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అధికారులు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక బహిరంగ ప్రకటన కూడా ఇచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ మార్గంలో ప్రస్తుతం ఉన్న చార్జీల క్రమంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ ఎయిర్ పోర్ట్ కి విమానాలను ప్రారంభించే సాధ్యాసాద్యాలను పరీక్షించే ప్రతిపాదన పై, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అంటూ, ఒక ప్రకటన జారీ చేసింది. విజయవాడ (గన్నవరం)- దుబాయ్ మధ్య విమాన సేవల పై ప్రజాభిప్రాయ సేకరణ కోసం, ఈ వెబ్సైటులో మన స్పందన తెలియచేయాలి, www.APADCL.com.

dubai 12012019

విజయవాడ - సింగపూర్ మధ్య సర్వీస్ సమయంలో కూడా, ఇలాగే చేసారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. దీంతో, విజయవాడ-సింగపూర్‌ మధ్య విమానయాన సేవలను ప్రారంభించారు. ఇప్పుడు దుబాయ్ వంతు. ప్రజాభిప్రాయం అధికంగా ఉంటే, దుబాయ్‌కు కూడా సర్వీసు నడిపేందుకు సా నుకూల పరిస్థితులు వస్తాయి . దుబాయ్‌కు కూడా సాకారమైతే ప్రపంచ దేశా లకెక్కడికైనా చేరుకోవటానికి విమాన సదు పాయాలు కలిగిన డెస్టినేషన్‌ ఎయి ర్‌పోర్టులకు మరింత కనెక్టివిటీ ఏర్పడుతోంది.

dubai 12012019

మరిన్ని సర్వీసులు... ముంబైకి వారంలో మూడుసార్లు కా కుండా డైలీ చేయాలన్న ఆలోచనలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఉన్నట్టు తెలు స్తోంది. చెన్నైకు స్పైస్‌ జెట్‌ విమాన సర్వీ సులను నడుపుతోంది. కోయంబత్తూరుకు కూడా సర్వీసు నడపాలన్న ఆలోచనలో ఇండిగో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు విమాన సర్వీసులు నడపాలన్న ఆలోచనలో ఎరురిండియా, ఇండిగో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. గుజరాత్‌కు వ్యాపార కలాపాల మీద రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువుగా ఉందని అధ్యయనంలో తేలటంతో ఈ రెండు సంస్థలు పోటీలు పడటం గమనార్హం. వారణాసికి సర్వీసు నడపాలన్న ఆలోచనలో స్పైస్‌ జెట్‌ సంస్థ ఉంది. గతంలో వారణాసికి ఈ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసు నడిపింది. ఆ తర్వాత అర్థంతరంగా రద్దు చేసింది. ఈ సర్వీసు రద్దుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. మళ్ళీ ఈ సర్వీసును పునరుద్ధరించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగా డైరెక్టు సర్వీసు కాకుండా హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్‌ మారేలా సర్వీసును నడపాలన్న ఆలోచనలో స్పైస్‌జెట్‌ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read