వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళకు- టాలీవుడ్ హీరో ప్రభాస్‌‌కు సంబంధం ఉందని గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ, నలుగురు నలుగురు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు అని చెప్పగానే, సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, షర్మిల పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పుదేప్పుడు బయటకు రాని షర్మిల ఇప్పుడు బయటకు వచ్చు, సరిగ్గా ఎన్నికల ముందు, బయటకు వచ్చి, ఈ ప్రచారం అంతటికీ కారణం చంద్రబాబు అంటూ, ఆయన పై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై నమ్మకం లేదు, అంటూ హైదరాబాద్ లో కంప్లైంట్ చేసింది షర్మిల..

sharmila 14012019

అయినా చంద్రబాబు మరీ ఇంత ఖాళీగా కనిపిస్తున్నారా వీళ్ళకి ? అప్పట్లో పవన్ పై, శ్రీరెడ్డి ఎదో వ్యాఖ్యలు చేసిందని, దాని పై చంద్రబాబు ఉన్నారంటూ, చంద్రబాబు పుట్టిన రోజునాడే, పెద్ద గేమ్ మొదలు పెట్టాడు పవన్. చంద్రబాబుకి శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ ను తిట్టించటం, సోషల్ మీడియాలో షర్మిల ను తిట్టించటమేనా పని ? సోషల్ మీడియా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ, చంద్రబాబు, లోకేష్ పై, వైసీపీ, జనసేన ఎలా ట్రోలింగ్ చేస్తారో, ఎంత జుబుక్సాకరంగా చేస్తారో అందరికీ తెలుసు. అప్పుడు మాత్రం, మహదానందం పొంది, ఇప్పుడు వచ్చి సూక్తులు చెప్తున్నారు. అయినా, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ, షర్మిల పై దారుణంగా పోస్ట్ లు పెడుతుంది ఎవరో , ఇట్టే తెలిసిపోతుంది.

sharmila 14012019

సింపుల్ గా సెర్చ్ చేస్తే, ఆ పోస్టింగ్ లు తెలుగుదేశం పెట్టినియ్యో, జనసేన పెట్టినియ్యో అర్ధమవుతుంది. ఇలాంటి పనులు ఎవరు చేసినా ఖండించాలి. కాని, చేసింది ఒకరు అయితే, నెపం మరొకరి మీదకు నెట్టి, అన్నీ చంద్రబాబు చేపిస్తున్నాడు అనటం ఎంత వరకు సమంజసం. తెలుగుదేశం వాళ్ళు పలానా పోస్టింగ్ పెట్టారు అని చూపించవచ్చు కదా. జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ను పట్టుకుని, నలుగురు నలుగురు పెళ్ళాలు అంటే, షర్మిల గారికి అది తప్పు అనిపించలేదా ? తమ్ముడ్ని ఖండించవచ్చు కదా ? మరో పక్క A2 రెడ్డి, ప్రతి రోజు ఎలా జుబుక్సాకరంగా పోస్ట్ లు పెడుతున్నాడో షర్మిల గారికి కనిపించటం లేదా ? మీరు మీరు కొట్టుకుని, దాన్ని చంద్రబాబు మీదకు నెట్టేస్తే ఎలా షర్మిల గారు ? జగన్ గారు, ఇలాంటి నీచమైన రాజకీయాలు తప్ప, మీకు వేరేవి తెలియవా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read