ఈ ఆర్థిక సంవత్సరం(2018-2019)లో మన దేశంలోకి వచ్చిన అతిభారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)గా ఏషియా పల్ప్‌, పేపర్‌ (ఏపీపీ) గ్రూపు పెట్టుబడి రికార్డు సృష్టించింది. ఆ పెట్టుబడి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రావడం విశేషంగా మారింది. ఇండోనేషియాకు చెందిన సదరు సంస్థ ఏకంగా రూ.24,500 కోట్లను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్రం సాధిస్తున్న పారిశ్రామిక ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ అనంతపురం జిల్లాలో రూ.13 వేల కోట్ల భారీ పెట్టుబడితో కార్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తుండగా తాజాగా అంతకు రెండింతల పెట్టుబడితో ఏపీపీ గ్రూపు కాగితపు గుజ్జు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.

cbn 09012019

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేసే ఈ కార్యక్రమంలో ఏపీపీ గ్రూపు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. పలు రాయితీలు, ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు కల్పించి ఏపీపీ గ్రూపును రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. కాగిత గుజ్జు తయారీకి అందుబాటులో ముడిసరకు, రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, తగినంత భూమి లభ్యత వంటివన్నీ ప్రకాశం జిల్లాలో ఇండోనేషియా సంస్థ పెట్టుబడులకు కలిసొచ్చిన అంశాలని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒకేచోట ఇంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడం ఇదే మొదటిసారని ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ అభిప్రాయపడ్డారు.

cbn 09012019

కియ, హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌, టీసీఎల్‌, రిలయన్స్‌ సెజ్‌, హెచ్‌సీఎల్‌ తదితర భారీ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. వివిధ భాగస్వామ్య సదస్సుల్లో రూ.15.42 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయి. అందులో రూ.1.77లక్షల కోట్ల పెట్టుబడితో 810 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటిద్వారా 2.51లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎంఎ్‌సఎంఈల ద్వారా 3.3 లక్షల మందికి, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా 1.78 లక్షల మందికిపైగా, ఎపిటా ద్వారా 13 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. భాగస్వామ్య సదస్సు ఒప్పందాల్లోని మరో 5.27 లక్షల కోట్ల పెట్టుబడితో 1211 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వచ్చిన పరిశ్రమలు ఇవీ... ఆటోమొబైల్‌ రంగం: ఇసుజు, కియ మోటార్స్‌, అపోలో టైర్స్‌, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ ఫోర్జ్‌, హీరో మోటార్స్‌. ఈ రంగంలో మొత్తం 24,800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌: ఈ రంగంలో 202 సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయి. వాటిలో ముఖ్యమైనవి... లావజ్జా, అవంతి సీడ్స్‌, పతంజలి, జైన్‌ ఇరిగేషన్‌, పార్లే, జెర్సీ, ఇండస్‌ కాఫీ, ఫ్యూచర్‌ గ్రూప్‌, కాంటినెంటల్‌ కాఫీ, ఇంటర్నేషనల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రెన్సెన్‌, గోద్రెజ్‌, ఎస్‌హెచ్‌ గ్రూప్‌, టాటా ఫుడ్స్‌, ఐటీసీ, కాన్‌ ఆగ్రో, మన్‌పసంద్‌. ఐటీ, ఎలక్ర్టానిక్స్‌: రాష్ట్ర విభజన తర్వాత 376 లీడ్‌లను ట్రాక్‌ చేశారు. కాండ్యునెంటల్‌, పైడేటా, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, విప్రో, మిరాకిల్‌ సాప్ట్‌ స్క్వేర్‌, ఫాక్స్‌కాన్‌, షామీ, జియోనీ, వన్‌ ప్లస్‌, ల్యూమినా, ఆసూస్‌, ఇన్‌ ఫోకస్‌ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌, డిక్సన్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఎల్‌ఈడీ టీవీలు తయారు చేస్తున్నాయి. టీసీఎల్‌కు శంకుస్థాపన జరిగింది. రిలయన్స్‌, వోల్టాస్‌ త్వరలో రానున్నాయి. ఫార్మా: హొస్పిరా హెల్త్‌కేర్‌, రెడ్డి ల్యాబ్స్‌, లుపిన్‌, లారస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా, వెస్ట్‌ ఫార్మా, దివీస్‌ ల్యాబ్య్‌. నాట్కో. టెక్స్‌టైల్స్‌: టోరే, టెక్స్‌పోర్ట్‌, మోహన్‌ స్పింటెక్స్‌, ఇండియన్‌ డిజైన్‌, షాహి ఎక్స్‌పోర్ట్స్‌, శ్రీగోవిందరాజా టెక్స్‌టైల్స్‌, ఎస్‌ఏఆర్‌ డెనిమ్‌, పేజ్‌ ఇండస్ర్టీ్‌స(జాకీ), అరవింగ్‌ గ్రూప్‌, నిషా డిజైన్స్‌, గుంటూరు టెక్స్‌టైల్‌ పార్క్‌, తారకేశ్వర టెక్స్‌టైల్‌ పార్క్‌లు. పర్యాటకం: విజయవాడలో నోవాటెల్‌, తిరుపతిలో తాజ్‌ గేట్‌వే, హాలిడే ఇన్‌, గుంటూరులో ఐటీసీ మై ఫార్చ్యూన్‌, విశాఖపట్నంలో జేడబ్ల్యూ మారియట్‌ హోటళ్లు ప్రారంభమయ్యాయి, సన్‌ రే రిసార్ట్స్‌ వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read