జగన్‌పై కోడికత్తి దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువరించడానికి ముందే కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్‌ఐఏ) అప్పగిస్తూ కేంద్రం ఆదేశించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై కోర్ట్ ఎలాంటి నిర్ణయం వెలువడక ముందే కేసు నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏను ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించారు. దీని వెనుకున్న ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ రాష్ట్రాన్ని ఏదోలా ఇబ్బంది పెట్టాలనే కుట్ర దీనిలో కనిపిస్తోంది. ఈ అంశంపై న్యాయస్థానాల్ని ఆశ్రయించి తేల్చుకుంటాం’ అని చంద్రబాబు వివరించారు.

nia 05012019

‘కోడికత్తి కేసును అంతర్జాతీయ విచారణ సంస్థకు అప్పగించినా నిజం మారదు. దిల్లీ మోదీ, ఆంధ్రా మోదీ (జగన్‌) కోడికత్తితో యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. తుస్సుమన్న కోడికత్తి డ్రామాకు కొత్త డైరెక్టర్‌ను పెట్టినంత మాత్రాన రక్తి కట్టదు.జగన్‌కు కేసులనుంచి విముక్తి కల్పించి ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతీయాలని కేంద్రం మరో కుట్రకు తెరలేపింది. ఆంధ్రా మోదీని కాపాడేందుకు దిల్లీ మోదీ సీబీఐని బీబీఐ (భాజపా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)గా మార్చింది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. మరో పక్క జగన్‌పై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తప్పిదం దొర్లింది. జగన్‌ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత కాగా, ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ నాయకుడిగా (లీడర్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ)గా ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. శాసనసభ నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటారు.

nia 05012019

ఇది ఇలా ఉండగా, మరిన్ని అనుమానాలు చేకూర్చే విధంగా, ఎన్‌.ఐ.ఎ అధికారులు, ఆగమేఘాలపై గురువారం విశాఖకు వచ్చారు. ఇక్కడి పోలీసు ఉన్నతాధికారులను కలిసి కేసు దర్యాప్తు వివరాలను కోరారు. కేసును అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వంనుంచి లిఖితపూర్వక ఆదేశాలు వస్తేగానీ తాము ఇవ్వలేమని ఎన్‌.ఐ.ఎ. బృందానికి సిట్‌ అధికారులు చెప్పినట్లు సమాచారం. దర్యాప్తు వివరాలు ఇవ్వడానికి వారు సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్‌ఐఏ ఏకపక్షంగా కేసు నమోదు చేసిందని వారు పేర్కొంటున్నారు. డిసెంబరు 31న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన ఆదేశాలను ఎన్‌.ఎ.ఐ. ప్రధాన కార్యాలయానికి పంపింది. గంటల వ్యవధిలోనే ఈ ఆదేశాలను హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి వారు పంపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read