ఏపీలోని విపక్ష పార్టీలపై సినీ నటుడు శివాజీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారంటూ హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. విపక్ష పార్టీలకు కావలసింది.. సీఎం కుర్చీ మాత్రమే అంటూ మండిపడ్డారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని... అంత ఇష్టముంటే రాజీనామా చేసి విపక్షపార్టీలో చేరాలన్నారు. విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని... వారికి కావాల్సింది సీఎం కుర్చీనే అన్నారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు లెక్కచేయడం లేదని... చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందన్నారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

sivaji 02012019

గట్టిగా మాట్లాడితే భూములు లాక్కుంటామని కలెక్టర్‌ బెదిరిస్తున్నారని.. ఆ భూములు కలెక్టర్‌ అబ్బ సొత్తా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. సీఎం బతిమిలాడుతున్నా కలెక్టర్లు వినడం లేదన్నారు. ప్రజలను టార్గెట్‌ చేసిన అధికారుల గల్లా పట్టుకుని అడుగుతానన్నారు. అన్ని ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేస్తానని శివాజీ తెలిపారు. అదే విధంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై కూడా ఆయన స్పందించారు. వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా తెలియని వ్యక్తి రాంగోపాల్‌ వర్మ అని దుయ్యబట్టారు. సుగ్రీవుడి పక్షాన రాముడు నిలిచినట్టుగా ఆనాడు పార్టీ కోసం చంద్రబాబు నిలబడ్డారని శివాజీ అన్నారు. ఆనాడు టీడీపీని కాపాడేందుకే..కేసీఆర్‌తో సహా అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేసింది లక్ష్మీపార్వతి వర్గం మనిషేనంటూ శివాజీ చెప్పారు.

sivaji 02012019

అది వెన్నుపోటు కాదని తెలుసుకున్న ప్రజలు..చంద్రబాబును రెండోసారి గెలిపించారన్నారు. చంద్రబాబు మద్దతు లేకుంటే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చేది కాదని వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేవారు కారని అన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు లేకపోతే వాజ్‌పేయి రెండోసారి ప్రధానమంత్రి అయ్యేవారే కాదని, భారతీయ జనతాపార్టీ నిలబడేది కాదని సినీ హీరో శివాజీ అన్నారు. చంద్రబాబు నాయుడుది వెన్నుపోటు కాదని తెలుసుకున్న ప్రజలు.. 1999లో ఆయనను గెలిపించారన్నారు. ప్రజల తీర్పు ముందు... వెన్ను పోటు అని మాట్లాడేవాళ్లది పెద్ద విషయం కాదన్నారు. ప్రజలు ఆ విషయాన్ని పట్టించుకోరని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన అభిప్రాయమని, నచ్చకపోతే వదిలేయమన్నారు. ఒక్క విషయం ఇక్కడ చెబుతున్నా... ఆ రోజున చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోతే ఇవాళ టీడీపీ ఉండేది కాదని శివాజీ స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read