ప్రధాని హోదాలో ఉండి, ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడే ప్రధాని, బహుసా మోడీనే అయ్యుంటారు. ఆంధ్రప్రదేశ్ కు చేసిన సహాయం పై, ఈ రోజు పచ్చి అబద్ధాలు ఆడుతూ, ప్రజలను మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నా మధ్య అమిత్ షా వచ్చి, లక్షల లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు, అసెంబ్లీ వేదికగా అమిత్ షా లెక్కలు అన్నీ బొక్కలే అని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రధాని మోడీ, లక్షల లక్షలు కాకపోయినా, 20 వేల కోట్లు ఇచ్చేసినట్టు చెప్పారు. బీజేపీ బూత్కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, మచిలీపట్నం, నరసాపురం, విశాఖపట్నం, విజయనగరం లోక్సభ స్థానాలకు చెందిన బూత్కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో, ఏపి ప్రభుత్వం పై అబద్ధాలు ప్రచారం చేసారు మోడీ. లోటు బడ్జెట్, రిసోర్స్ గ్యాప్ కింద ఏపీకి 20 వేల కోట్ల వరకు విడుదల చేశామని, ఏపీ ప్రభుత్వం మాత్రం అందలేదని చెబుతోందన్నారు. మరి ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళిందంటూ మోదీ ప్రశ్నించారు. ప్రధాని హోదాలో ఉంటూ, ఇలాంటి చిల్లర మాటలు ఎలా మాట్లాడారో ఆయనకే తెలియాలి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకూ ఇచ్చారు, ఇక్కడ కొత్తగా మనకు ఇచ్చింది ఏమి లేదు. 2013-14 సంవత్సరానికి లోటు బడ్జెట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది విభజన చట్టంలో ఉన్నది, దీని పై మాత్రం మాట్లాడరు. ఇక ఎవరి జేబులోకి వెళ్ళింది అంటున్న మోడీ, ఆయన ప్రధాని అనే సంగతి మర్చిపోయాడు. దమ్ము ఉంటే, చంద్రబాబు ఇది నోక్కేసాడు అని ఏపి ప్రజల ముందు ఆధారాలు పెట్టచ్చు కదా ? 20 వేల కోట్లు ఏమయ్యాయో, తెలియని ప్రధాని ఎందుకు ?
ఇక మరొకటి, వెనుకబడిన జిల్లాలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చారంట. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సింది 23వేల కోట్లు. ఇది కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఇవ్వటం లేదు. సిగ్గు లేకుండా 350 కోట్లు మన రాష్ట్ర ఎకౌంటు లో వేసి, మరీ వెనక్కు తీసుకున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పటం లేదు మోడీ గారు ? ఇక అన్నిటికి కంటే వింత ఆరోపణ, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు అంట. ఏపి ప్రభుత్వం అన్నిటికీ లెక్కలు చెప్పి, ఆ కాగితాలు కూడా బయటకు ఇచ్చింది. అవన్నీ ప్రజలు చూసారు కూడా. అయినా ఈ సిగ్గులేని ప్రధాని అబద్ధాలు ఆడతారు. ఇక పోలవరానికి 7 వేల కోట్లు ఇచ్చారంట, ఇంకా ఇవ్వాల్సిన 4 వేల కోట్లు గురించి మాత్రం చెప్పారు. అవి ఎందుకు సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి, దాని వల్ల రాష్ట్రానికి పడుతున్న వడ్డీ భారం గురించి మాట్లాడరు. డీపీఆర్ 2 ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించాలేదో చెప్పరు. ఏపీలో పది జాతీయ విద్యాసంస్థలు ప్రరంభించారంట. కాని వాటిని ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్నిటికీ కాంపస్ లు కట్టారు, ఇలా నిధులు ఇస్తూ పొతే ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతాయో మాత్రం చెప్పరు. చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలకు అసత్యాలు చెబుతున్నారన్నారు. ఇవన్నీ ఏపికి వచ్చి చెప్పే దమ్ము లేదు కాని, ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు మన ప్రధాని గారు. దేశంలో అందరినీ మాయ చేసినట్టు, మా ఆంధ్రులని మోసం చెయ్యలేరు మోడీ గారు, సరైన సమయంలో సమాధానం చెప్తాం...