ఉక్రెయిన్‌లో పుట్టి బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల కేంద్రంగా పనిచేసే డీఎఫ్‌ గ్రూప్‌ అధినేత దిమిత్రొ ఫిర్తా్‌షకు చెందినదీ సంస్థ. ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నది బోయింగ్‌ విమానయాన సంస్థ. ముడుపుల బాగోతంలో నిందితుడు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఈ వ్యవహారం గతంలోనే బయటపడినా ఇందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు పొక్కలేదు. తాజాగా బోయింగ్‌ కోసం పనిచేసిన వ్యాపార సలహా సంస్థ- మెకిన్సే అండ్‌ కంపెనీ ఆనాడు ఇచ్చిన నివేదికలో కొన్ని భాగాలు ఇపుడు బయటకొచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం పై సమగ్ర కధనం ప్రసారం చేసింది (https://www.nytimes.com/2018/12/30/world/mckinsey-bribes-boeing-firtash-extradition.html?). 2006లో బోయింగ్‌ ప్రారంభించదల్చుకున్న డ్రీమ్‌లైనర్‌ విమానాలకు తేలికపాటి టైటానియం స్పేర్‌పార్టుల కొరత ఏర్పడింది. అప్పట్లో టైటానియం ధరలు విపరీతంగా ఉండడం, విమానాల ప్రారంభతేదీ దగ్గరపడుతుండడంతో.. బోయింగ్‌.. మెకిన్సేను ఆశ్రయించింది. వాణిజ్యపరమైన వివరాలందివ్వడమే కాదు, ప్రభుత్వాలకు ఎలా గాలం వేసి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చో చెప్పడంలో మెకిన్సేది అందెవేసిన చెయ్యి.

new 02012019 1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని చాలా మండలాల్లో టైటానియం నిక్షేపాలున్నట్లు అప్పటికే గుర్తించడం జరిగింది. వీటిని వెలికితీస్తే తమకు లాభదాయకమవుతుందని బోయింగ్‌ అంచనా. ఏటా 500 మిలియన్‌ డాలర్లు (రూ 3487 కోట్లు) వ్యాపారం, ఆదాయం దీని ద్వారా జరుగుతుందని ఆ సంస్థ ఆనాడు అభిప్రాయపడింది. అక్రమమార్గాలలో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో దిట్ట అయిన దిమిత్రో ఫిర్తాష్‌ను ఇందుకోసం ఎన్నుకుంది. ఆనాడు 8 మంది భారతీయ కీలక అధికారులకు ముడుపులు చెల్లించిన మాట వాస్తవమని మెకిన్సే నివేదిక ద్వారా తెలుస్తోంది. అయితే ఆ పేర్లను న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అన్నింటికీ కేంద్రబిందువు అయిన కేవీపీ ద్వారా ఈ కథ నడిచినట్లు వెల్లడయింది. లైసెన్సుల మంజూరు, ఏయే అధికారులకు ఎంతెంత ఇవ్వాలన్నది కేవీపీ ద్వారానే ఖరారైందని.. ఆయనతో పెరియసామి సుందరలింగం అనే దళారీ సంప్రదింపులు జరిపాడనీ అమెరికాలోని ఇల్లినాయి నార్ద్రర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సాగిన ఓ కేసులో ఫెడరల్‌ జ్యూరీ ఆరోపించింది.

new 02012019 1

ఫిర్తాష్‌, కేవీపీ, సుందరలింగం సహా ఏండ్రాస్‌ నాప్‌, సురెన్‌ గెవర్గాన్‌, గజేంద్ర లాల్‌ అనే ఎన్‌ఆర్‌ఐలు ఈ కేసులో దోషులని పేర్కొంది. మైనింగ్‌ ప్రాజెక్టు అంతిమంగా 2014లో రద్దయినప్పటికీ నాటి ముడుపుల బాగోతం వెన్నాడుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఫిర్తాష్‌ సన్నిహితుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రచార సారథిగా పనిచేసిన పాల్‌ మన్‌ఫోర్ట్‌కు కూడా సన్నిహితుడు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయముందని, ట్రంప్‌కు రష్యన్‌ గూఢచార సంస్థలు సహకరించాయని, డెమొక్రాట్ల వ్యూహాల లీక్‌లో పుతిన్‌ టీమ్‌ హస్తం ఉందని ఆరోపణలు రావడం, వాటిపై రాబర్ట్‌ మ్యూలర్‌ ఆధ్వర్యంలో విచారణ సాగుతుండడం తెలిసిందే. ఆనాడు ట్రంప్‌ రష్యా లింకుల్లో ఫిర్తాష్‌ ఓ కీలక వారధి అని ఎఫ్‌బీఐతో పాటు అమెరికా రాజకీయ సంస్థలు అనుమానిస్తున్నాయి. బోయింగ్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఫిర్తా్‌షను తమకు అప్పగించాలని షికాగోలోని ఓ కోర్టు కోరుతోంది. ఓస్ట్‌కెమ్‌ హోల్డింగ్‌ ఏజీ అనే సంస్థ అక్రమ లావాదేవీలపై ఫిర్తా్‌షను ఆస్ట్రియా ప్రభుత్వం నిర్బంధించి 174 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుపై విడుదల చేసింది. ఆ సొమ్ము ఏర్పాటుచేసినది పుతిన్‌కు సన్నిహితుడైన మరో వ్యాపారవేత్త. భారత్‌లో (ఏపీలో) లంచాలు ఎరవేసి ఓ ప్రాజెక్టును సాధించడానికి ఫిర్తాష్‌ ప్రయత్నించాడని, ఆయన చాలా ప్రమాదకారి అనీ ఆస్ట్రియా ప్రభుత్వానికి ఈమెయిల్‌ సందేశం రావడంతో ఆయనను దేశం విడిచిపోనివ్వకుండా కట్టడి చేసింది. ఇప్పటికే ఈ అవినీతి భాగోతం అంతా, కేసు స్టడీగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో పాఠాలుగా చెప్పబడుతున్న రాజశేఖర్ రెడ్డి ,కేవీపీ రామచంద్రరావుల అవినీతి చరిత్ర ఈ కింద లింక్ లో ఉంది. http://fcpa.stanford.edu/enforcement-action.html?id=499

Advertisements

Advertisements

Latest Articles

Most Read