ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని టీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రకటించడం, రాష్ట్రానికి వచ్చిన టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వైసీపీ పెద్దలు ఘనస్వాగతం పలకడం వంటి ఘటనలు వైసీపీ పార్టీలోని మెజారిటీ నేతలకు రుచించడం లేదు. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ కలిసి రాజకీయం చేయబోతున్నాయనీ, ఆంధ్రావాళ్లను పదేపదే దూషించిన కేసీఆర్, కేటీఆర్‌లతో జగన్ ఎలా చేతులు కలుపుతారనీ వారు నిలదీశారు. ఏపీలో కూడా సెంటిమెంట్ ఉందని గుర్తుచేశారు. ఆంధ్రాకు ప్రత్యేకహోదా వద్దన్న నేతలతో జగన్‌ ఎలా భేటీ అవుతారని కూడా వారు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోనూ ఆంధ్రావాళ్లను టీఆర్ఎస్ నేతలు దూషించారని చెబుతూ.. సంబంధిత వీడియో క్లిప్పులను మంత్రి దేవినేని ఉమ మీడియాకు విడుదలచేశారు. ఇదిలా ఉంటే, కేటీఆర్, జగన్‌ల భేటీ, అనంతరం వారిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడటం వైసీపీలోని కొందరు నేతలకి అస్సలు నచ్చలేదట. ఓ సీనియర్ నేత అయితే ఈ విషయాన్ని జగన్‌ వద్దే బాహాటంగా చెప్పారట. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధిచెప్పిన ప్రజలు ఇప్పుడూ వైసీపీ విషయంలోనూ అలాగే చేస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే పరిశ్రమలు తరలిపోతాయన్న హరీశ్‌రావు వ్యాఖ్యల్ని కూడా తెలుగుదేశం నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

jaganan 22012019

ఏపీకి రావల్సిన వాటిని అడ్డుకుంటున్న వారితో ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఎలా చేతులు కలుపుతారని టీడీపీ నేతలు మూకుమ్మడిగా దండెత్తడంతో వైసీపీ డిఫెన్స్‌లో పడింది. ప్రజల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్న వైసీపీ నేతలు డ్యామేజీ కంట్రోల్‌కు ప్రయత్నించారట. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కృష్ణాజిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో "రాష్ట్రాన్ని చీల్చిన వాళ్లతో పొత్తు ఎలా పెట్టుకుంటారు?" అని తెలుగుదేశంలోని కొందరు ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ పెద్దలను నిలదీయడంతో "కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని'' టీడీపీ హైకమాండ్‌ ముఖ్యులు బహిరంగంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్‌తో తమ మైత్రిపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు వైసీపీ వాళ్లు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదిస్తే కేసీఆర్ అంగీకరించలేదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు. అయితే ఈ వాదన ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేదు.

jaganan 22012019

త్వరలో కేసీఆర్ ఏపీకి రాబోతున్నారనీ.. ఫెడరల్ ఫ్రంట్‌పై మరింత లోతైన చర్చలు జరుపుతామనీ జగన్ ప్రకటించడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు. ఫిబ్రవరిలో 14న ఉండవల్లిలో వైసీపీ కార్యాలయంతోపాటు తన గృహప్రవేశానికి కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేసీఆర్‌ను ఆహ్వానించాల్సిన అవసరం లేదనీ.. ఫ్రంట్‌పై చర్చలు మరోసారి జరపవచ్చనీ ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ఏపీ టూర్ వాయిదా పడే అవకాశం ఉందని కూడా వైసీపీ నేతలు ఆఫ్‌ ద రికార్డు‌గా చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం కేసీఆర్‌ను ఆహ్వానించి తీరాలనే అనుకుంటున్నారట. అదే జరిగితే జగన్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నట్టవుతుందని ఓ వైసీపీ నేత విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయాల వల్ల తటస్థ ఓటర్లు వ్యతిరేకం అవుతారని ఆందోళన చెందుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read