ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. కొందరు నేతలు ఇసుక ర్యాంపుల్లో దోచుకుంటున్నారని విష్ణకుమార్‌రాజు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొందరు నడుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో విష్ణుకుమార్‌రాజుతోపాటు మరో ముగ్గురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

vishnu 11012019

ఇప్పటికే ఒక ప్రధాన పార్టీ నుంచి బీజేపీలో చేరిన ముఖ్యమైన మహిళా నాయకురాలు కూడా కమలానికి గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆమె వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి ఎమ్మెల్యే, తనకు ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. కుమారుడికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా... ఆమెకు ఎంపీ టికెట్‌ పై స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన మరో కీలక నేత చల్లాపల్లి నరసింహారెడ్డి సైతం పార్టీలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు స్టేక్ లేకపోవటంతో, ఆ పార్టీలో ఉండటానికి ఎవరూ సాహసించటం లేదు.

vishnu 11012019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడీ నమ్మించి మోసం చేసిన తీరుతో, ప్రజలు బీజేపీ పై రివర్స్ అయ్యారు. దానికి తోడు, అడుగు అడుగునా రాష్ట్రాన్ని అవమానించటం, రాష్ట్రానికి అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఇన్ని ఇచ్చాం అంటూ హడావిడి చెయ్యటం, ప్రతి సందర్భంలో నిధులు ఆపెయ్యటం, ఇవన్నీ చూస్తున్న ప్రజలకు బీజేపీ అంటే మంట ఎక్కుతుంది. దీనికి తోడు, జీవీఎల్ లాంటి వాళ్ళ మాటలు వింటుంటేనే, ప్రజలు మండిపడుతున్నారు. దీంతో బీజేపీ అంటేనే, మండే పరిస్థితి వచ్చింది. కనీసం పంచాయితీ ఎన్నికల్లో వార్డ్ మెంబెర్ గా కూడా, బీజేపీని గెలిపించని స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే ఆ పార్టీలో ఉన్న నేతలు అందరూ, రాజకీయ భవిషత్తు కోసం, పార్టీలు మారుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read