రాష్ట్రంలో సుమారు 22 లక్షల నిరుపేద వృద్ధులకి పెద్ద కొడుకు అతను... భారమై ఒకరు... మరొక కారణంతో ఒకరు, తమ తల్లి తండ్రులని జీవితపు చరమాంకంలో వదిలేస్తుంటే, వారికి భరోసా అతను.... ఒంట్లో ఓపిక లేని నిరుపేద వృద్ధులకి భారసో అతను... ఒకరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న ఆ పండుటాకులకి భరోసా.... జీతాల మాదిరి, ప్రతినెలా ఒకటో తేదీనే ఆ వృద్ధులకి అందిస్తున్న భరోసా... ఆ భరోసా పేరే నారా చంద్రబాబు నాయుడు... ఆ భరోసానే ఎన్టీఆర్ భరోసా... పేదలకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ తో సంక్షేమానికి సరికొత్త నిర్వచనమిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయన్ని లిఖిస్తోంది. అయితే ఇప్పుడు పింఛన్ల మొత్తాన్ని ఫిబ్రవరి నుంచి రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులకే కాదు, వితంతువులకు, వివిధ వర్గాలకు ఇచ్చే పెన్షన్లు కూడా పెరగనున్నాయి.

pensions 1112019

జనవరి నుంచే పెంపును అమల్లోకి తీసుకురావాలన్న యోచనా చేస్తోంది. అలా అమలు చేసినట్లైతే ఫిబ్రవరిలో జనవరికి సంబంధించిన పెంపు మొత్తం కూడా అందజేస్తారు. 2014కి ముందు నెలకి రూ.200గా ఉన్న అన్నిరకాల పింఛన్లను తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదు రెట్లు పెంచి రూ.1,000 చొప్పున అందించింది. దివ్యాంగులకు, హిజ్రాలకు రూ.1,500 చేసింది. 2017 సెప్టెంబరు నుంచి డయాలసిస్‌ రోగులకు రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లపై సమీక్షించి.. రెట్టింపు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వృద్ధాప్య, వితంతువులకు పింఛను మొత్తం నెలకు రూ.2,000 చెల్లించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు కలిపి 50,61,906 మందికి పంపిణీ అవుతున్నాయి.

pensions 1112019

వీటిపై నెలకి రూ.560కోట్లు చొప్పున ఏడాదికి రూ.6,720కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్నిరకాల పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తే నెలకి రూ.1,120కోట్లు, ఏడాదికి రూ.13,440కోట్లు చొప్పున వెచ్చించాలి. ఇప్పటికే మంజూరై పంపిణీ అవుతున్న పింఛన్లకే ఈ మొత్తం ఇవ్వాలి. డిసెంబర్‌ ఆఖరు నాటికి వివిధ రకాల పింఛన్లు కావాలని కోరుతూ ప్రభుత్వానికి 2.5లక్షల దరఖాస్తులందాయి. తాజా జన్మభూమి గ్రామ సభల్లో తొమ్మిదో తేదీ నాటికి పింఛన్ల కోసం మరో 1.05లక్షల దరఖాస్తులందాయి. ఇతర రూపాల్లో అందిన విజ్ఞప్తులకు మరో లక్ష మందికి ఇవ్వాల్సి వస్తుందనుకున్నా మొత్తం 4.55లక్షల కొత్త పింఛన్లు మంజూరయ్యే వీలుంది. వీటికి సైతం ఫిబ్రవరి నుంచే పెంచిన మొత్తం అందుతుంది. కొత్త వాటినీ కలిపితే మొత్తం పింఛన్ల సంఖ్య 55.16లక్షలకు చేరుతుంది. ఈ మేరకు ప్రభుత్వం వెచ్చించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పింఛన్ల మంజూరుతోపాటు పెంచే మొత్తానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈనెల మూడు, నాలుగో వారంలో వెలువడే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read