గన్నవరం నుంచి దుబాయ్ కి డైరెక్ట్ ఫ్లైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అధికారులు కొన్ని రోజుల క్రిందట ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక బహిరంగ ప్రకటన కూడా ఇచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ ఎయిర్ పోర్ట్ కి విమానాలను ప్రారంభించే సాధ్యాసాద్యాలను పరీక్షించే ప్రతిపాదన పై, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అంటూ, ఒక ప్రకటన జారీ చేసింది. అయితే, ఇదేదో ఫోర్మలిటీగా చేసారు. ప్రజల నుంచి ఎదో రెస్పాన్స్ వస్తుందిలే అనుకున్నారు కాని, ప్రజాలు మాత్రం అనూహ్యంగా రెస్పాన్స్ ఇచ్చారు.
సింగపూర్‌కు విమాన సర్వీస్ ప్రవేశపెట్టే ముందు కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. అప్పట్లో 60 వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి లోటు భర్తీ నిధి (వీజీఎఫ్) సమకూర్చే అవకాశం లేకుండానే గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. దుబాయ్‌కు ప్రవేశపెట్టే సర్వీసుపైనా ఆన్‌లైన్‌లో ఇప్పటికే లక్ష మందికిపైగా అనుకూలతను వ్యక్తం చేశారు. అంటే సింగపూర్ ఫ్లైట్ కి వచ్చిన రెస్పాన్స్ కంటే డబల్.. విజయవాడ నుంచి దుబాయ్ వెళ్లే వారు హైదరాబాద్ వెళ్లి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చాక ఇక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు.
సింగపూర్ విమాన సర్వీసు విజయవంతం కావడంతో ఇప్పుడు దుబాయ్ కోసం ఏపీఏడీసీఎల్ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి అనతి కాలంలో మంచి స్పందన రావడంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. లోటు భర్తీ నిధి విధానంలో గన్నవరం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ నెలాఖరులో విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలవనుంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు https://www.apadcl.com/ అనే వెబ్సైటులో, 1,02,710 మంది తమ ఇష్టాన్ని తెలియచేసారు.