‘కేసీఆర్‌ హుందాతనాన్ని కోల్పోయి చాలా దారుణంగా మాట్లాడారు. వాడే భాష కూడా అసభ్యంగా.. నాగరిక ప్రపంచం అంగీకరించని రీతిలో ఉంది.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.. గర్హిస్తున్నా..’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కాకూడదనే లక్ష్యంతోనే మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం శ్వేతపత్రం విడుదల సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై, వాడిన భాషపై చంద్రబాబు మండిపడ్డారు. ‘ఆయన ఒడిశాకు.. పశ్చిమబెంగాల్‌కు వెళ్లారు.. అక్కడ ఏమీ అనుకూలించలేదని నిరాశకు గురైతే నేనేం చేస్తాను.. నాకేం సంబంధం...’ అని పేర్కొన్నారు. అలాగే పదే పదే ఓటుకు నోటు పై కేసీఆర్ బెదిరించటం పై కూడా మాట్లాడారు.

return 31122018

"మాట్లాడితే ఓటుకు నోటు అంటున్నారు.. దానిపై కొంత మంది కోర్టుకు వెళ్లారు.. దాన్ని కొట్టేశారు.. ఏముంది దీనిలో కేసే లేదు.. ఆయన మాటలే అయినా ఇందులో విషయం లేదన్నారు.. అయినా రుబాబు చేయాలనుకుంటున్నారా? బెదిరించడం.. బ్లాక్‌మెయిల్‌ చేయడం.. ఏంటి ఇదంతా? కేసులు పెడతారా? మీరొక కేసు పెడితే.. నేను నాలుగు కేసులు పెడతా? ఫోన్‌ ట్యాపులు ఉన్నాయి.. ఇంకొకటి ఇంకొకటి చాలా ఉన్నాయి. అన్నీ బయటకు వస్తాయి. వివాదాలెందుకని నేను హుందాతనంగా ఉంటుంటే.. వీళ్లే తెలివైన వారిమన్నట్లు ఇష్ట ప్రకారం మాట్లాడి జనాల్ని తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు. ఎలుగుబంటి సూర్యనారాయణ, ఈఎస్‌ఐ కేసుల నుంచి తప్పించి పెద్ద సాయం చేశారు. మోదీ పని అదే కదా? కేసు లేకపోతే పెడతారు.. ఉంటే తప్పిస్తారు.. తన దగ్గరకు వచ్చేలా బ్లాక్‌మెయిల్‌ చేస్తారు.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మీద తప్పుడు కేసులు పెట్టించారని సీబీఐ డైరెక్టరే చెప్పారు." అని చంద్రబాబు అన్నారు.

return 31122018

‘మోదీ, ఆయన కలిసి దేశాన్ని మోసం చేద్దామనుకున్నారు.. ఎవరి సహకారం లభించడం లేదు. అక్కసుతో మనపై పడుతున్నారు...’ అని విమర్శించారు. ‘దేశ ప్రయోజనాల కోసం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఆలోచనతో.. మోదీ చేసే అన్యాయాలపైనే పోరాడుతున్నా.. నేను ఎక్కడా మాట తూలనప్పుడు కేసీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడటం ఏమిటి? భగవంతుడు నోరిచ్చాడని పారేసుకోవడం తప్పు కదా?...’ అని ఆగ్రహం వెలిబుచ్చారు. ‘ఎన్ని సంక్షోభాలు చూడలేదు.. మోదీతోనే పోరాటం చేస్తున్నా.. నన్ను మానసికంగా దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదు...’ అని వివరించారు. ‘నా రాజకీయ జీవితమంతా విలువలతో కూడినదే. కష్టాలొచ్చినా... ఇబ్బందులొచ్చినా.. అవతలి వాళ్లు పరుషంగా మాట్లాడినా.. చులకనగా, హేళనగా మాట్లాడినా.. ఎప్పుడూ హుందాతనం కోల్పోలేదు. అదే సమయంలో సమస్యలపై రాజీ పడలేదు....‘ అని స్పష్టం చేశారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరి మీదకు పోను.. చెప్పాల్సి వచ్చినప్పుడు గట్టిగా చెప్పాల్సి వస్తోంది. గెలిచిన తర్వాత హుందాతనం పెరగాలి..’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read