మోడీ-షా లకు గడ్డు కాలం ఎదురవుతుంది. వరుస పరాజయాలు ఒక వైపు, ఒక్కటొక్కటిగా జారిపోతున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పార్టీలో అంతర్గతంగా వారి పై వస్తున్న వ్యతిరేకతతో, మోడీ, షా లకు టెన్షన్ మొదలైంది. మూడు కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌లలో బీజేపీ పరాజయం, సంఘ్‌సేవక్‌ల బలం ఉన్న తెలంగాణలో ఒక్క సీటుకే పరిమితం కావడం.. ఇవన్నీఆర్‌ఎస్ఎస్ కు ఆందోళనకరంగా పరిణమించాయి. మోదీ నాయకత్వాన తదుపరి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ సంస్థలో సడలుతోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీని క్రమంగా తెరపైకి తెస్తోంది. మూడు హిందీ రాష్ట్రాల్లో ఓటమికి నాయకత్వం బాధ్యత తీసుకోవాలని బహిరంగంగా ప్రకటించిన ఏకైక నేత గడ్కరీ. ఈ మాటలు అన్నది ఆయనే అయినా.. పలికించింది మాత్రం సంఘేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

rss 31122018 2

మోదీ-షా తీరుతో మిత్రులు దూరమవుతున్న నేపథ్యంలో సంఘ్‌ మార్గదర్శకత్వంలోనే గడ్కరీ కొత్త స్నేహితులకు చేరువయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అభిమానాన్ని సంపాదించారు. నాగపూర్‌ ఎంపీ అయిన గడ్కరీకి.. అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. ఆయన పనితీరును విపక్షాలు కూడా మెచ్చుకుంటాయి. కార్పొరేట్‌ రంగానికి కూడా అత్యంత ఇష్టుడు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సొంతగా మెజారిటీ రాకుంటే.. ఇతర పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అగత్యం ఏర్పడితే.. ఆ సంకీర్ణానికి మోదీ బదులు గడ్కరీ నాయకత్వం వహించాలని సంఘ్‌ భావిస్తున్నట్లు సమాచారం. త్రిపుర, మణిపూర్‌, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్య విజయాలు సాధించినందుకు మోదీ-షాను గతంలో మెచ్చుకున్న సంఘ్‌.. బీజేపీకి బలమున్న 3 రాష్ట్రాల్లో దెబ్బతినగానే.. వారిని పక్కనపెట్టుకోవాలనుకోవడం విశేషమని విశ్లేషకులు అంటున్నారు.

rss 31122018 3

గాలి వారికి వ్యతిరేకంగా వీస్తోందని సంఘ్‌ అగ్రనేతలకు అర్థమైందని.. అందుకే గడ్కరీకి కీలక పాత్ర అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. కాలం తనకు అనువుగా మారుతోందని ఆయన కూడా గ్రహించారని.. అందుకే మోదీ-షాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సంఘ్‌ కార్యకర్తల్లో తొలిసారి మోదీ కంటే గడ్కరీకి అధిక మద్దతు లభిస్తోందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. అయితే సంఘ్‌ దన్ను ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరూ గడ్కరీకి వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టలేదని తెలుస్తోంది. అయితే గడ్కరీ వ్యాఖ్యలు ప్రధాన పత్రికల్లో రాకుండా మోదీ-షా నేర్పుగా మేనేజ్‌ చేసుకోవడం గమనార్హం. కాగా శివసేన, టీడీపీ, ఆర్‌ఎల్‌ఎ్‌సపీ, హిందూస్థాన్‌ అవామీ వంటి పార్టీలు ఎన్డీఏ నుంచి దూరం కావడానికి మోదీ-షా పెత్తందారీ ధోరణి కారణమని సంఘ్‌ నేతలు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read