ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఒక బ్రాండ్.. 1995లో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ, ఐటిని ప్రవేశపెట్టిన విధానం, ఐటిని పాలనలో వాడటం, ఇవన్నీ చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన టోనీ బ్లెర్, హైదరాబాద్ లో ఆన్లైన్ లో, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చిన విధానం చూసి ఆశ్చర్యపోయి, స్వయంగా పరిశీలించారు. ఇక ఐటిలో వేసిన అడుగులు, చంద్రబాబు పరిపాలన స్టైల్, ఆయన కష్టపడే తత్త్వం, ఆయన విజన్, ఇవన్నీ ఒక సెన్సేషన్. ఎక్కడో మారుమూల ఉండే ఏపిలోని సైబెరాబాద్ వరల్డ్ డెస్టినేషన్ అయ్యింది అంటే, అది ఆ నాడు చంద్రబాబు చూపించిన చొరవ. దేశాధినేతలు కూడా ఆయన అభిమానులు అయ్యారు అంటే, అది చంద్రబాబు విజన్.
ఎంత మంది ఎంత హేళన చేసిన, అది చరిత్ర. చెరిపేస్తే, చింపేస్తే, పోదు. ఇది నిజం అని మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్ లో జనవరి 15 నుంచి ప్రయాగలో జరిగే కుంభమేళ ఉత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాధ్ తరఫున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహనా ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి ఆహ్వానం అందజేశారు. వారణాసిలో జనవరి 21 నుంచి మూడురోజులపాటు జరిగే ప్రవాస భారతి దినోత్సవానికి కూడా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా యూపీ మంత్రి సతీష్ మహనా మాట్లాడుతూ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల అమలులో "మీరే నాకు స్పూర్తి" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. "ప్రజలకు సేవ చేయాలన్న తపనతో నిరంతరం విశ్రమించని నేత మీరని" అభినందించారు. పాలన ద్వారా అనునిత్యం ప్రజలకు మంచి చేయడానికి మీరు పడుతున్న తపన ఆదర్శనీయమన్నారు."ఆనాడు మీరు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని స్పూర్తిగా తీసుకుని తాను గతంలో యూపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశానని గుర్తు చేసుకున్నారు. " మీహయాంలో రాష్ట్రాభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో సాధిస్తున్న విధానంతో మిమ్మలను సీఈవొ అని ముద్దుగా పిలుచుకునే వారమని స్మరించుకున్నారు. ఈ సమావేశంలో సీఎం కార్యదర్శులు రాజమౌళి, సాయి ప్రసాద్ లు పాల్గొన్నారు.