సీఎం చంద్రబాబు మీద ఘాటు విమర్శలు చేసిన కెసిఆర్ మీద టీడీపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు. మంత్రులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాలు పెట్టి చెడామడా ఏకిపారేయగా మరో మంత్రి నక్కా ఆనందబాబు కూడా కెసిఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కెసిఆర్ బాష చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చీదరించుకుంటున్నారన్న నక్కా కెసిఆర్ కు రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబేనన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. కెసిఆర్ మోడీకి అద్దె మైకు, జగన్ రెడ్డి సొంత మైకులా తయారయ్యారని అన్నారు. కేసీఆర్ భాషను చూసి ఆ రాష్ట్ర ప్రజలు ఛీదరించుకుంటున్నారని ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు.
కెసిఆర్ ఏపీలో జగన్ తో కలిసి కుట్రల చేయాలని చూస్తున్నారని ఎవరు ఎంత ప్రయత్నాలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. కెసిఆర్ అవాకులు, చవాకులు దారుణమైనవని.. చంద్రబాబు పెంచితే కెసిఆర్ నాయకుడయ్యారన్న నక్కా.. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు. సిఎం చంద్రబాబు పై వాడిన భాషకు కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు. ఏపిలో జగన్‌తో కలిసి కుట్రలు చేస్తే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తాము శ్వేత పత్రాలు విడుదల చేసుకుంటే కేసీఆర్ కు సంబంధం ఏంటని అసలు కేసీఆర్ కు విలువ ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అసలు సిగ్గు ఉందా అంటూ నిలదీశారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్, ఆ తర్వాత 2009లో చంద్రబాబు కాళ్లు పట్టుకుని తెలుగుదేశంతో పొత్తుకోసం వెంపర్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు.
ఉడత ఊపులకు చింతకాయలు రాలవన్నట్లు కేసీఆర్ వల్ల ఏపీలో ఏమీ జరగదన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఏపీలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తన తాబేదార్ వైఎస్ జగన్ తో కలిసి పోటీ చేస్తాడో, బీజేపీతో కలిసి పోటీ చేస్తాడో దమ్ముంటే ఏపీలో పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మరోక రాష్ట్రముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ వాడుతున్న భాషను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ముందు బాష నేర్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడుకు పదేపదే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చెప్తున్నాడని ఆయన ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్, జగన్, బీజేపీ ముగ్గురు కలిసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపలేరని మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.