దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను, మోడీ, అమిత్ షా నిర్వీర్యం చేస్తున్నారని, దేశంలోని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తుంటే, కేసీఆర్, జగన్ సినిమా చూసారు. 15వ ఆర్ధిక సంఘం కండీషన్స్ చూస్తే, దక్షిణాది రాష్ట్రాలను నాశనం చేసే కుట్ర చేస్తున్నారని, దక్షినాది రాష్ట్రాలు కలిసి పోరాటం చేస్తే, అప్పుడు కూడా కేసీఆర్, జగన్ సినిమా చూసారు. దేశంలో అన్ని వ్యవస్థలు, మోడీ, షా నాశనం చేస్తుంటే, అప్పుడు కూడా కేసీఆర్, జగన్ సినిమా చూసారు. దేశంలో అన్ని పార్టీలు ఏకం అయ్యి, మోడీ పై అవిశ్వాస తీర్మానం పెడితే, మొదటి సారి, అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా డ్రామా ఆడింది కేసీఆర్, రెండో సారి అక్కడ నుంచి పారిపోయింది జగన్.ఇలా మోడీ పేరు చెప్తే, తడుపుకునే కేసీఆర్, జగన్, ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఫిడేల్ వాయిస్తూ, ఫిడేల్ ఫ్రంట్ అని ఒకటి మొదలు పెట్టారు. ఇందులో ఇప్పటి వరకు చేరింది, కేసీఆర్ తో పాటు జగన మాత్రమే.

ktrjagan 16012019

అయితే ఈ మోడీ ఫిడేల్ ఫ్రంట్ గురించి ఈ రోజు, కేటీఆర్, జగన్ మాట్లాడుతూ, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారంటే, అసలు మోడీకి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నది మేమిద్దరమే అన్నంత బిల్డ్ అప్ ఇచ్చారు. తెలంగాణా ఎన్నికలు అయ్యే దాకా, మేము ప్రత్యేక హోదాకు వ్యతిరేకం అని చెప్పిన కేసీఆర్, అవిశ్వాస తీర్మానం సమయంలో, మన ఆంధ్రా గురించి మాట్లాడుతుంటే, ప్రత్యేక హోదా అడుగుతుంటే, ఎలా అడ్డుపడ్డారో చూసాం. తెలంగాణా ఎన్నికల్లో పదే పదే ప్రత్యేక హోదా ఇస్తే మేము ఊరుకోం అంటూ, ఎన్నికలు అవ్వగానే, ప్రత్యేక హోదా అయితే పర్వాలేదు, పారిశ్రామిక రాయతీలకు మేము వ్యతిరేకం అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నాడు కేసీఆర్. ఎందుకంటే జగన్ తో కలిసి, ఏపిలో రాజకీయం చేసి, చంద్రబాబుని తప్పించి, ఏపి రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోవటానికి.

ktrjagan 16012019

ఈ ప్రయత్నంలోనే, కేటీఆర్, జగన్ భేటీ అయ్యారు. వీళ్ళు తరువాత మీడియాతో మాట్లాడుతూ, కామెడీ పండించారు. జగన్ మాట్లాడుతూ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేటీఆర్‌తో చర్చించామని, తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించామని, ప్రత్యేక హోదాపై ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, దేశంలో పరిస్థితి చర్చించామని, అలాగే రాష్ట్రాల హక్కుల కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని, కేసీఆర్‌తో తదుపరి చర్చలు జరుపుతామని జగన్ అన్నారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని, దేశంలోని పలు పార్టీల అధినేతలతో కేసీఆర్‌ సంప్రదింపులు జరిపారని కేటీఆర్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగానే జగన్‌తో సమావేశం నిర్వహించామని, జగన్‌తో అన్ని విషయాలపై చర్చలు జరిపామని కేటీఆర్ అన్నారు. మోడీ అంటే పారిపోయే ఈ పోటుగాళ్ళు, దేశం కోసం, అంటూ ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, బలే కామెడీగా ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read