రియల్‌టైం గవర్నెన్స్‌ పనితీరు అద్భుతం, ఆమోఘం, స్ఫూర్తిదాయకం అంటూ బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సచివాలయంలో సోమవారం రాత్రి ఆర్టీజీఎస్‌ పనితీరును 45 నిమిషాల పాటు ఆద్యంతం ఆసక్తిగా గమనించిన ఆయన చివరగా చేతులు జోడించి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అమేజింగ్‌.. అంటూ కితాబునిచ్చారు. ‘అత్యద్భుతం.. మీరో విప్లవం సృష్టించారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది లేదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రపంచానికి డిజిటల్‌ పాఠాలు అందించాలి. ఆర్టీజీఎస్‌ కేంద్రం అమోఘం’ అని బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ కితాబిచ్చారు. రాష్ట్ర ప్రగతికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయమని సీఎం చంద్రబాబును ప్రశంసించారు. పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు, ప్రజలకు రియల్‌టైమ్‌లో సేవలు అందించేందుకు...ఆర్టీజీ కేంద్రం ఎలా పనిచేస్తుందన్నదీ సీఎం ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రజలకు సమగ్రంగా సేవలందించే పద్ధతిని సాంకేతికత తోడుతో ఎలా అభివృద్ధి చేశామో తెలియజేశారు.

blair 08012019 2

ఈ సందర్భంగా బ్లెయిర్‌ మాట్లాడుతూ.. రియల్‌టైమ్‌లో ప్రజలకు అందిస్తున్న సేవలు తనను ఆకట్టుకున్నాయన్నారు. ‘ప్రకృతి విపత్తులను ఏపీ సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ముచ్చట గొలిపింది. బిగ్‌ డాటాను ఉపయోగించుకుని పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఆనందంగా ఉంది. మీరు(సీఎం), నేను దాదాపు ఒకేసారి అధికారం చేపట్టాం. కానీ పదేళ్ల ప్రధాని పదవి తర్వాత నేను ఆగిపోయాను. మీరింకా కొనసాగుతున్నారు. ఇక్కడినుంచి ప్రపంచానికి పాఠాలు తీసుకెళ్లొచ్చు. ఆర్‌టీజీఎ్‌సలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని తెలి పారు. ఈ టెక్నాలజీ అంతా ఎక్కడినుంచి తీసుకున్నారని బ్లెయిర్‌ ప్రశ్నించారు. ఇదివరకు దేనికదే అన్నట్లుగా టెక్నాలజీ ఉండేదని, అన్నిటినీ ఒక వేదికపైకి తెచ్చి సమగ్ర సాంకేతిక పద్ధతిని అభివృద్ధి చేశామని అధికారులు తెలిపారు.

blair 08012019 3

ఆర్‌టీజీఎస్‌ పనితీరును సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బ్లెయిర్‌కు వివరించారు. ఏడాది క్రితం ప్రారంభించిన ఆర్‌టీజీఎస్‌ ఇప్పుడు రాష్ట్ర ప్రజల గుండె చప్పుడులా మారిందని, పరిష్కార వేదిక 1100 కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 1,74,60,944 ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించి వాటిని పరిష్కరించామని తెలిపారు. అమలు చేస్తున్న పథకాలతోపాటు, ప్రభుత్వ పనితీరుపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ.. వారిలో 80 శాతం సంతృప్తి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం మొత్తం 20 వేల నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతల మొదలు, పారిశుఽధ్యం, పచ్చదనం వరకు రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బ్లెయిర్‌ను చంద్రబాబు శాలువా కప్పి సన్మానించారు. లేపాక్షి నంది, అరకు-ఆర్గానిక్‌ కాఫీ ప్యాకెట్లను బ్లెయిర్‌కు బహుమానంగా ఇచ్చారు. అనంతరం ఆయనకు విందు ఇచ్చారు. ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read