ప్రతి విషయంలోని ఏపి ప్రజలని అవమానపరుస్తున్న కేంద్రం, తాజగా, దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఏపీ శకటం పాల్గునకుండా, అనుమతి నిరాకరించి, మరో సారి మన రాష్ట్రాన్ని అవమాన పరిచింది. స్వాతంత్ర్య ఉద్యమం, మహాత్మా గాంధీ జీవితం ఇతివృత్తాలతో కూడిన శకటం తయారు చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం సూచించింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విజయవాడ గాంధీకొండ, స్థూపం, ఏపీలో స్వాతంత్ర్య ఉద్యమ ఇతివృత్తంతో శకటం సిద్ధంచేసింది. అయితే మొదట ఈ శకటం బాగుందంటూ కేంద్ర అధికారులు కితాబిచ్చారు. ఇంతలోనే అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న కేంద్రం.. శకటం సరిగ్గాలేదని చెప్పడం గమనార్హం. చివరి నిమిషంలో ఏపీ శకటానికి కేంద్ర రక్షణశాఖ అనుమతి నిరాకరించడంతో ఏపీలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

cbn 07012019 2

ఏపీ శకటం పైన కూడా ప్రధాని మోదీ అక్కసు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో భాజపా కక్ష సాధింపునకు ఇది పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వక పోవడంపై లేఖ రాయాలని, కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని పార్టీ నేతలతో సోమవారం సీఎం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అందుకే ఏపీపై మోదీ అసూయ పెంచుకున్నారని, అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని సీఎం అన్నారు. ఏపీ పేరు వినబడితేనే ఆయనకు అక్కసు పెరిగిపోతోందని, రాష్ట్ర పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హుందాతనం వదిలేసి మోదీ మాట్లాడుతున్నారని, తన కుటుంబం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

cbn 07012019 3

పోలవరం కాంక్రీటు పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఇదొక చారిత్రక ఘట్టమని సీఎం స్పష్టంచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నామన్నారు. 6వ రోజు ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరం రికార్డు సాధించడంలో చెమటోడ్చిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఇది వేలాది కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది కష్టమని, ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. శరవేగంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నందుకు సీబీఐపీ అవార్డు సాధించామని, అది అందుకున్న నాలుగు రోజులకే మరో రికార్డు సాధించామని చెప్పారు. ఇది నిజంగా ప్రతి తెలుగువాడికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read