పోలవరం స్పిల్ వే ఛానెల్ కాంక్రీట్ పనులలో గిన్నిస్ రికార్డును అందుకున్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇది రాత్రికి సాధించిన రికార్డ్ కాదని, దీని వెనుక అధికారుల కృషి, పట్టుదల ఉందన్నారు. ఇప్పటివరకు ఉన్న దుబాయ్ కంపెనీ రికార్డ్ ను బ్రేక్ చేశామని.. సమీప భవిష్యత్ లో ఈ రికార్దును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరందించామని.. పోలవరానికి కేంద్రం నిధులు సకాలంలో చెల్లించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి నిర్మాణంలో వేగం పెంచిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లోటులో ఉన్నా పోలవరానికి 3715 కోట్లు ఖర్చు పెట్టామని.. 33274 కోట్లు భూసేకరణ కోసం కావాలని.. మొత్తం 58 వేలకోట్లు పోలవరానికి ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే కేంద్రానికి పోలవరం ప్రాజెక్ట్ పై లక్ష పేజీల సమాచారమిచ్చామని.. కానీ కేంద్రం నిధుల విడుదలలో చొరవ చూపడం లేదన్నారు.

dpr 07012019

మార్చిలోగా ప్రాజెక్టు పనుల్లో మళ్లీ రికార్డు సృష్టించాలని చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం కాంక్రీట్ పనులు గిన్నీస్ బుక్ రికార్డ్స్ కు ఎక్కిన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రపంచ రికార్డును అందుకున్నారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ….భవిష్యత్ లో ఏపీ చేసే పనులను మిగతా రాష్ట్రాలు అనుసరిస్తాయన్నారు. ఇది రైతుల ప్రాజెక్ట్… రాష్ట్రానికి జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనేది ఉండదన్నారు. పోలవరం పూర్తయిన తర్వాతనే సోమవారం గుర్తు పెట్టుకుంటానన్నారు. పోలవరం పనుల్లో చరిత్ర సృష్టించిన అందరికీ అభినందనలన్నారు. చరిత్రలో భాగస్వాములు కావడం అరుదుగా జరుగుతుందన్నారు. 24గంటల్లో ఎక్కువ కాంక్రీట్ పోయడంలో రికార్డు నమోదైందన్నారు. ప్రపంచంలో, దేశంలో చాలా పెద్ద ప్రాజెక్టు పనులు జరిగాయని, కానీ ఆ ఘనత పోలవరం ప్రాజెక్టు పనులకు మాత్రమే దక్కిందన్నారు.

dpr 07012019

మార్చిలోపు ప్రాజెక్టు పనుల్లో మళ్లీ రికార్డు సృష్టించాలని.. ఒకే రోజు 65 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని నవయుగ సంస్థకు సీఎం సూచించారు. దేశంలోనే పోలవరం ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు అన్నారు. దేశ ప్రతిష్ఠ పెంచేవిధంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక ప్రాజెక్టులో అందరూ భాగస్వాములు కావాలని, అడ్డుపడొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావడం అరుదుగా జరుగుతుందన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని పునరుద్ఘాటించారు. పోలవరం పూర్తయితేనే సోమవారం గుర్తుపెట్టుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ చేసే పనులను భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తాయని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read