విభజన హామీలు అమలు చెయ్యలేదని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంది కేంద్రం. హామీలు అమలు గాలికి వదిలేసి, హక్కుగా వచ్చేవి కూడా ఇవ్వకుండా, కక్ష సాధిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్ట్ లను అడ్డుకుంది. కేంద్రం ఎంత అడ్డుకున్నా, చంద్రబాబు తనకు ఉన్న అనుభవం, పలుకుబడి, గుర్తింపుతో, ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెస్తున్నారు. ఇదే కోవలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తారు. అక్కడ పారిశ్రామిక వేత్తలను కలిసి, మన రాష్ట్రంలో పెట్టుబడులు గురించి వివరిస్తూ, పెట్టుబడులు తెస్తూ ఉంటారు. అయితే, చంద్రబాబు దావోస్ పర్యటన పై కేంద్రం కన్ను పడింది. కక్ష సాధింపులకు ఇది పరాకాష్ట. చివరకు మన సొంతగా నిలబడతాం అంటున్నా, కేంద్రం కుదరదు అంటుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు పెట్టడం ఇదే తొలిసారి. దావోస్ పర్యటనను ఏడు రోజులకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది. ముఖ్యమంత్రి వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా... నలుగురికే అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ నెల 20న బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు.
ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్‌కి వెళ్లడం ఆనవాయితీ. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఆయనతోపాటు, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ సహా 14 మంది సభ్యుల బృందం వెళ్లాలన్నది ఆలోచన. ఈ మేరకు రాజకీయ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే దేశానికి లాభం కాదన్నట్లుగా ఉంది మోదీ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదన్నమాట అయితే..