న్యూటన్స్ థర్డ్ లా అంటే ఇదేనేమో... ప్రతి ఆక్షన్ కి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అంటారు ఇందుకే.. అమిత్ షా, మోడీ కలిసి, వాళ్ళ చేతిలో అధికారం ఉందని, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఊరుకుంటారా, వీళ్ళకి టైం వచ్చినప్పుడు, వీళ్ళకు టైం వచ్చినప్పుడు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. అదే ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టరు ల్యాండింగుకు మమతాబెనర్జీ నుమతి నిరాకరించిన ఉదంతం మాల్దా జిల్లాలో సంచలనం రేపింది. స్వైన్ ఫ్లూ జ్వరం నుంచి కోలుకున్న బీజేపీ అధినేత అమిత్ షా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో ఈ నెల 22వతేదీన ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో కోల్‌కతాకు వచ్చి అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తల ర్యాలీలో పాల్గొనేందుకు మాల్దాకు హెలికాప్టరులో రావాలనుకున్నారు.

mamatha 21012019

ఈ మేరకు వీవీఐపీ హెలికాప్టరు మాల్దాలో ల్యాండింగు కోసం అనుమతించాలని మాల్దా జిల్లా అధికారులకు బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. తమ పీడబ్లూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నివేదిక ప్రకారం మాల్దా హెలిపాడ్ హెలికాప్టరు దిగేందుకు అనువుగా లేదని, అక్కడ ఇసుక, నిర్మాణ సామాగ్రి ఉన్నాయని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బీజేపీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాత్కాలిక హెలిపాడ్ లో కూడా నిర్మాణ పనులు చేపట్టినందున అమిత్ షా హెలికాప్టరు దిగేందుకు సురక్షితం కాదని అందుకే తాము హెలికాప్టరు ల్యాండింగుకు అనుమతించడం లేదని మాల్దా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో అమిత్ షా హెలికాప్టరు మాల్దాలో ల్యాండింగుకు మమతా బెనర్జీ సర్కారు నిరాకరించింది. ఈ ఉదంతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాల్దా హెలిపాడ్ హెలికాప్టరు ల్యాండింగుకు అనువుగా ఉన్నా జిల్లా అధికారులు అనుమతి నిరాకరించడం బీజేపీతో మమతకు ఉన్న వైరుధ్యమే కారణమని తెలుస్తోంది.

mamatha 21012019

అమిత్‌షా హెలికాప్టర్‌ను మాల్డా హెలిపాడ్‌పై దిగిందేకు టీఎంసీ సర్కార్ అనుమతించలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారంనాడు మీడియాకు తెలిపారు. ఇదే హెలిపాడ్‌పై కొద్ది రోజుల క్రితం మమతా బెనర్జీ హెలికాప్టర్ ల్యాండ్ అయిందని చెప్పారు. కాగా, బీజేపీ విమర్శలను టీఎంసీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. తాము అనుమతి ఇచ్చినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని ఆమె చెప్పారు. భద్రతా కారణాల రీత్యా అమిత్‌షా హెలికాప్టర్‌ను వేరే చోట ల్యాండ్ చేయాలని పోలీసులు కోరారని, తాను సైతం పోలీసుల అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ల్యాండింగ్‌‌ను వేరేచోట మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నందువల్లే అమిత్‌షా మీటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read