వైసీపీ బిజెపి తెరాస ఒక్కటే అని ఇప్పటికే చెప్తుంటే నమ్మని వారు, ఈ వార్తా చూసైనా నమ్ముతారేమో. ఇప్పటికే జగన్, పవన్, మేము తెలంగాణాలో పోటీ చెయ్యటం లేదు అంటూ చేతులు ఎత్తేసారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలాగూ, అక్కడ ఉన్న జగన్, పవన్ వర్గం, ఓట్లు వేసేది తెరాస పార్టీకే. అందుకే అనవసరంగా ఓట్లు చీల్చటం ఎందుకని, వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, వీళ్ళు, ఇప్పుడు బహిరంగంగా కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ గెలిస్తే, మనకు ఆంధ్రాలో వైసీపీ పార్టీకి అనుకూలం అని చెప్తున్నారు. శనివారం అందరం కలిసి కేటీఆర్ కు మద్దతు తెలుపుదాం అంటూ హైదరాబాద్ లో వైసీపీ కార్యకర్తలకు వాట్స్ అప్ మెసేజ్ వెళ్ళింది.
ఇది ఆ వాట్స్ అప్ సారంశం "రాజన్న భక్తులకు, జగనన్న సైనికులకు మనవి..24 అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సీమంధ్రుల ఐక్యత పేరుతో నిర్వహించే కార్యక్రమానికి కేటీఆర్ వస్తున్నారు. ప్రతి జగనన్న సైనికుడు, పాల్గుని సంఘీభావం ప్రకటించండి. కూకటపల్లిలో టీఆర్ఎస్ ను మనం గెలిపిద్దాం. మన ధ్యేయం మహాకూటమి ఓటమి, కేసీఆర్ గెలుపు. మన ఐక్యత చూసి టిడిపి భయపడాలి, అలా కేసీఆర్ ను గెలిపిద్దాం. మనం టీఆర్ఎస్ ను గెలిపించాలి, మహాకుటమిని ఓడించాలి. తరువాత టీఅరఎస్, మన వైసీపీకి తోడుగా, అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రావటానికి, జగన్ అన్న సియం అవటానికి ఎంతో సహకరిస్తుంది." అంటూ సందేశాలు పంపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులకు భద్రత ఉండదని కొందరు భయపెట్టించారని, నాలుగేళ్ల కాలంలో తాము ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదని పలువురు వైసీపీ కార్యకర్తలు అన్నారు. టీఆర్ఎస్ పాలనలో తాము బాగానే ఉన్నామని, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఈ నెల 24న కూకట్‌పల్లిలోని ఎన్ గార్డెన్స్‌లో సంఘీభావ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావాలన్నది సీమాంధ్రుల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణాలో కెసిఆర్ కు వైసీపీ నమ్మిన బంటో ఈ ప్రకటనే సాక్ష్యం.