భారతీయ చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాను చూసిన మీకు, మహిష్మతి రాజ్యాన్ని మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదేమో. మహిష్మతి పేరుతో అద్భుతమైన నగరాన్ని కళ్లకు కట్టారు, దర్శక ధీరుడు రాజమౌళి. సినిమా దర్శకుడే అయినా.. రాజమౌళిలోని సృజనాత్మకతతో పాటు, దేశ చరిత్ర, సంస్కృతులపై మంచి పట్టు ఉందని నమ్మిన చంద్రబాబు ఆయనలోని ఆ నైపుణ్యన్ని అమరావతి కోసం వాడుకున్నారు. దీంతో రాజమౌళి, నార్మన్ ఫోస్టర్ టీంతో కలిసి పని చేసారు. బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని ఆయన చెప్పిన సూచన, అందరికీ నచ్చింది.
అయితే ఈ విషయం పై, అమరావతి ద్వేషి అయిన జగన్ పార్టీ, వేరే రకంగా సృష్టించి, రాజమౌళి చేత రాజధానిలో సినిమా సెట్టింగ్ వేస్తున్నారు అనే ప్రచారం చేసారనుకోండి అది వేరే విషయం. అయితే అమరావతికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రాజమౌళి తాజాగా వెల్లడించారు. రాజధాని నిర్మాణ విషయమై తనను సంప్రదించినప్పుడు ఆరు నెలలపాటు తప్పించుకు తిరగడానికి ట్రై చేశానన్నారు. అర్కిటెక్చర్ గురించి తనకేం తెలుసని తనని సంప్రదిస్తున్నారనే విషయం అర్థం కాలేదన్నారు.
కానీ చంద్రబాబు ఏదైనా అనుకుంటే వదిలే రకం కాదని.. ఇక కలవక తప్పలేదని రాజమౌళి తెలిపారు. అనంతరం చంద్రబాబుకి, లండన్‌లో ఉన్న ఆర్కిటెక్‌లకు వారధిగా పనిచేశానన్నారు. తాను ఒక డిజైన్‌ను సూచించానని.. కానీ అది ఓకే కాలేదన్నారు. అప్పటికే రెడీగా ఉన్న ఒక డిజైన్ ఓకే అయిందన్నారు. ఆ బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని సూచించానని ఆ ప్రతిపాదనను మాత్రం అంతా ఆమోదించారని రాజమౌళి తెలిపారు. మళ్ళీ ఈ ప్రకటన పై, జగన్ బ్యాచ్ మళ్ళీ ఏ హడావిడి చేస్తుందో..