ఇక్కడ కప్పు కాఫీ కూడా దొరకటం లేదు, కనీస ఏర్పాట్లు కూడా చెయ్యటం లేదు, ఇదేమి వైఖరి అంటూ, వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరో సదా సీదా వ్యక్తీ కాదు. ఒక హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్. మన అమరావతిలో ఉన్న హైకోర్ట్ కి ఛీఫ్ జస్టిస్ గా ఉన్న,జస్టిస్ జేకే మహేశ్వరి. అమరావతిలో ప్రస్తుత పరిస్థితి చూసి, ఆవేదన చెంది చేసిన వ్యాఖ్యలు ఇవి. మే 2019 దాకా, అమరావతి ప్రాంతం, ఈ ప్రపంచంలోనే అతి పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా. దాదపుగా 40 వేల మండి కార్మికులు, ఇక్కడ పని చేసే వారు. అటు శాశ్వత సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ పనులు, మరో పక్క జడ్జి, ఐఏఎస్, ఐపిఎస్, మినిస్టర్ క్వార్టర్స్, ఇలా ఒక కిమీ పొడవునా, కన్స్ట్రక్షన్ ఆక్టివిటీతో ఆ ప్రదేశం కళకళలాడుతూ ఉండేది. ఇక మరో పక్క ప్రైవేటు కాలేజీలు, హోటల్స్ కట్టడాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది. ప్రస్తుత ప్రభుత్వానికి, అమరావతి అంటే ఇష్టం లేదనే విషయం తెలిసిందే.

highcourt 24102018 2

దీంతో వారు రాగానే, అమరావతి మొత్తం ఆపేశారు. 40 వేల మండి కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అమరావతి ప్రాంతం అంతా ఒక నిశబ్ద వాతావరణం అలుము కుంది. సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ జరిగే టైంలో అసెంబ్లీ, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసే వెళ్ళిపోయే ఘోస్ట్ సిటీగా తయారు అయ్యింది. అయితే, ఈ రోజు హైకోర్ట్ లో, ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ రోజు హైకోర్ట్ లో, అమరావతి స్విస్‌ చాలెంజ్‌ పిటిషన్‌ పై విచారణ జరిగిన సందర్భంలో, ప్రభుత్వ తరుపు న్యాయవాది నాలుగు వారాల పాటు వాయిదా కోరారు. దీంతో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కేసు వాయిదా వేసిన తరువాత, తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అసలు అమరావతి పై మీ వైఖరి ఏంటి, ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

highcourt 24102018 3

జడ్జిలకు క్వార్టర్స్ కూడా లేవు, కనీసం కప్పు కాఫీ తాగటానికి సదుపాయాలు లేవని, ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందా? లేదా? అమరావతి పై మీ వైఖరి ఏంటి అంటూ, ప్రభుత్వ న్యాయవాదిని చీఫ్‌ జస్టిస్ అడిగారు. అయితే ప్రభుత్వ న్యాయవాది ఈ పరిణామంతో షాక్ అయ్యారు. చంద్రబాబు హయంలో జడ్జిలకు క్వార్టర్స్ నిర్మాణం మొదలు పెట్టి, తాత్కాలిక వసతులు కల్పించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ క్వార్టర్స్ నిర్మాణం ఆపేయటంతో, జడ్జిలకు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. అలాగే, హైకోర్ట్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ మూత పడింది, దగ్గరలో ఉన్న హోటల్స్ కూడా జనాలు లేక మూత పడ్డాయి. హైకోర్టులో గత ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు కూడా, ఇప్పటి ప్రభుత్వం కల్పించ లేకపోవటంతో, జడ్జిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉండటంతో, చీఫ్ జస్టిస్ ప్రభుత్వ న్యాయవాది పై అసహనం వ్యక్తం చేసారు. మరి ప్రభుత్వం, దీనికి ఏమని సమాధానం చెప్తుందో చూడాలి.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఘన విషయం సాధించిన సందర్భంలో, కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చాలా రోజుల తరువాత కేసీఆర్ మాట్లాడటంతో, ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, ఆర్టీసి సమ్మె పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తదితర అంశాల పై ప్రజలు ఆసక్తిగా ప్రెస్ మీట్ విన్నారు. అయితే, అటు ఆర్టీసి వర్గాలను, ఇటు జర్నలిస్ట్ లను, అటు ప్రతిపక్షాలను, అందరినీ కలిపి, తిట్టి తిట్టి పెట్టారు కేసీఆర్. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం లేదని, తిన్నది అరగక, ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. అసలు ఆర్టీసినే కనుమరుగు అవుతుంటే, ఇంకా యూనియన్ లు, స్ట్రైక్ లు ఏంటి అని కేసీఆర్ అన్నారు. వారితో చర్చలు జరిపే పనే లేదని, వాళ్ళు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని తేల్చి చెప్పారు. ఇది యూనియన్ ఎన్నికల ముందు, వాళ్ళు చేస్తున్న పనికి మాలిన సమ్మె అంటూ, ఆర్టీసి ఉద్యోగులుని తిట్టి పోశారు కేసిఆర్.

kcr 24102019 2

యూనియన్ ఎన్నికలు వచ్చిన ప్రతి సారి, ఇలాంటి పనికిమాలిన సమ్మెలు చేస్తూ, గొంతెమ్మ కోర్కెలు కోరతారని అన్నారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక్కొక్కరికీ 50 వేలు జీతం వస్తుందని, ఇంకా కోర్కెలు ఉన్నాయని అన్నారు. ఆర్టీసిని నష్టాల బాట పట్టించి, మా మీద పడితే మేము ఏమి చేస్తాం అని అన్నారు. మా కాళ్ళు మేమే నరుకుట్టాం అని అంటే ఏమి చేస్తాం అని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల వైఖరిని తాను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించనని కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసికి సంబంధించి, నాకంటే, ఎవరికీ ఎక్కువ తెలియదు అని కేసీఆర్ అన్నారు. ఎవరు పడితే వారొచ్చి, గవర్నమెంట్‌లో కలపమంటే కలుపుతారా అని కేసీఆర్ అన్నారు.

kcr 24102019 3

అయితే ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి విలీనం గురించి, విలేఖరులు ప్రశ్నించగా, కేసీఆర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. "జగన్ గురించే చెప్తున్నా.. అక్కడ మన్ను కూడా అవ్వదు... అక్కడ ఆర్టీసి విలీనీం జరగలేదు.. ఆర్టీసి విలీనీం అనేది అసంభవం.. అక్కడ ఏదో ప్రయోగం చేసారు. నేను చెప్తున్నానుగా కధ.. ఎప్పుడో వస్తుంది అంట రిపోర్ట్, మూడు నెలలో, ఆరు నెలలో.. అది వచ్చినప్పుడు చూద్దాం.. ఇది అయ్యే పని కాదు.. ఎక్కడా జరగదు..." అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం కమిటీలతో కాలయాపణ చేస్తారు అనే ఉద్దేశంగా కేసిఆర్ మాట్లాడారు. మరి ఈ విషయం పై, జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసిన సంఘాలు, కార్మికులు ఏపి ప్రభుత్వం నుండి స్పష్టత తెచ్చుకునే అవసరం ఎంతైనా ఉంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఏపి ప్రభుత్వం స్పందించాలి..

గన్నవరం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పక్క గన్నవరం ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు ఒక వైపు లీక్ చేస్తుంటే, మరో వైపు ఈ రోజు జగన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన వంశీకి పిలుపు రాలేదు. మరో పక్క వంశీ ఈ రోజు నియోజకవర్గ స్థాయి సమీక్షను టిడిపి కార్యాలయంలో చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి వంశీని అరెస్ట్ చేస్తే ? లేకపోతే జగన్ సభలో వంశీ, టిడిపి అభిమానులు ఆందోళన చేస్తే ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు జగన్ పర్యటన సాఫీగా సాగిపోయేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసారు. వంశీని అరెస్ట్ చెయ్యాలి అనుకుంటే, జగన్ పర్యటన అయిపోయిన తరువాతే అరెస్ట్ చేసే అవకాసం ఉంది. ఇక మరో పక్క ఎమ్మెల్యే వంశీ కూడా అరెస్ట్ చేసే చేసుకోండి అనే విధంగా, తన కార్యాలయంలో కూర్చుని నియోజకవర్గ టిడిపి సీనియర్లతో సమీక్ష చేస్తున్నారు.

vamsi 24102019 2

అయితే జగన్ పర్యటన ఉన్న రోజే, వంశీ బయటకు రావటం పై, పోలీసులు అలెర్ట్ అయ్యారు. జగన్ వైఖరి పై నిరసన ఏమైనా తెలిపే అవకాశం ఉందా, అనే విధంగా పోలీసులు ఆలోచిస్తున్నారు. మూడు రోజుల క్రితం వంశీ పుట్టిన రోజు అయినా, కార్యాలయానికి రాలేదు. దీంతో కేసుకు భయపడి వంశీ పారిపోయారు అంటూ ప్రచారం చేసారు. దీంతో వంశీ ఈ రోజు, ఆఫీస్ లోనే కూర్చుని, ఆ ప్రచారం చేస్తున్న వారి నోరు మూయించారు. మరో పక్క, నకలీ పట్టాలు సృష్టించారు అంటూ వంశీ పై నమోదు అయిన కేసులు, ఆయన్ను అరెస్ట్ చెయ్యటానికి, పోలీసులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే స్పీకర్ నుంచి కూడా అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో జగన్ పర్యటన అయిపోగానే, వంశీని అరెస్ట్ చేసే అవకాసం ఉంది.

vamsi 24102019 3

అయితే ఇప్పటికే వంశీ హైకోర్ట్ లో ఈ కేసు పై పిటీషన్ వేసారు. నిన్నే కోర్ట్ నుంచి ఉత్తర్వులు వస్తాయి అని అనుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం లోపు, కోర్ట్ కు ఈ విషయం పై ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాసం ఉంది. ఇవన్నీ ఇలా సాగుతూ ఉండగానే, వంశీ పార్టీ మారిపోతున్నారు అంటూ మరో ప్రచారం కూడా సాగుతుంది. జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆయన బీజేపీ లోకి వెళ్ళిపోతున్నారని, ఇప్పటికే తనకు గాడ్ ఫాదర్ అయిన సుజనా చౌదరిని కలిసారనే ప్రచారం జరుగుతుంది. దీని పై వంశీ స్పందిస్తూ, తాను టిడిపి ప్రతిపక్షంలో ఉండగా రాజకీయాల్లోకి వచ్చానని, సీతారమంజనీయులు సీపీగా ఉండగా, తనను ఎంతో ఇబ్బంది పెట్టారని, మొన్న ఎన్నికల్లో కూడా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని, తాను ఈ ఒత్తిళ్లకు భయపడను అని, కోర్ట్ లో తేల్చుకుంటానని, పార్టీ మారాను అని చెప్తున్నారు..

బీజేపీలో రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, ఈ రోజు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందార్బంగా, అమిత్ షా తో జగన్ భేటీ పై వచ్చిన వార్తల పై, ఆయన మాట్లాడుతూ అక్కడ జరిగిన విషయం చెప్పారు. అమిత్ షా కు జగన్ ఇచ్చిన వినతి పత్రం బేస్ లెస్ అని సుజనా చౌదరి అన్నారు. రెవెన్యూ లోటు విషయం లో తప్పుడు లెక్కలతో జగన్ ఢిల్లీ వచ్చారని సుజనా అన్నారు. అమిత షా - జగన్ భేటీ ల పై ఉద్దేశం గురించి వ్యాఖ్యానించను అని, అయతే ఆయాన అపాయింట్మెంట్ విషయంలో వచ్చిన వార్తల పై స్పందించారు. అమిత్ షా తో అపోయింట్మెంట్ విషయం లో సిఎంవో సరిగా కోఆర్డినేట్ చేసుకోలేదని, ఆ తప్పుని, అమిత్ షా కార్యాలయం మీదకు నెట్టేస్తున్నారని సుజనా అన్నారు. అపాయింట్మెంట్ కుదిరిన తరువాత రావాలి కాని, ఇక్కడకు వచ్చి ఆయానకు కుదరని టైంలో, అపాయింట్మెంట్ కావాలని చెప్పటం, కుదరకపోతే అమిత్ షా ని నిందించటం సరి కాదని అన్నారు.

sujana 24102019 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు గమనిస్తుంటే, అసలు రాష్ట్రంలో పరిపాలన ప్రారంభమైనట్లు లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడో ఉన్నా, గెలిచి నాలుగు నెలలే అయినా, ఇప్పటి నుంచే జగన్ ఓట్ల రాజకీయం ప్రారంభించారని సుజనా అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయంలో, శ్రీశైలం లో జలవిద్యుత్ కేంద్రం లో జరుగుతున్న తంతే కారణం అని అన్నారు. శ్రీశైలం లో జలవిద్యుత్ కేంద్రం లో రిపేర్లు కూడా చేయించుకోలేక పోయారని, సీలేరులో కాలువకు గండి పడిందని, అందువల్లే విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని ప్రభుత్వం చెప్పింది అని, అది నిజమే అని సుజనా చెప్తూ, ఆ గండి పడి ఇప్పటికి 70 రోజులు అయ్యింది అని, ఆ విషయం మర్చిపో కూడదు అని అన్నారు.

sujana 24102019 3

70 రోజుల నుంచి, గండి పుడ్చ లేక, విద్యుత్ ఉత్పత్తి చెయ్యక, దీనివల్ల 500 కోట్లతో బయట నుంచి విద్యుత్ కొంటున్నారని సుజనా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పరినామాలపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి గా ఉందని సుజనా అన్నారు. అద్దె ఇంటికి, సొంత ఇంటికి, ఒకే టెండర్ పిలిచునట్లు పోలవరం టెండర్లు పిలిచారని అన్నారు. విభజన హామీల ను సాదించుకోవడానికి 22 మంది ఎంపీ.లు ఏమి చేస్తున్నారని, అసలు కేంద్రం ఎంత ఇవ్వాలి అనే దానిపై రాష్ట్రం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని అన్నారు. ఇప్పుడు కొత్తగా రాజధాని పై అపోహలు సృష్టిస్తున్నారని, రాజధాని లో 9 వేల కోట్ల పనులు జరిగితే, పీటర్ కమిటీ రిపోర్ట్ అంటూ, 30 వేల కోట్ల దుబారా అని ఎలా చెపుతారని ప్రశ్నించారు. 2023 నాటికి జమిలీ ఎన్నికలు ఖాయమని సుజనా అన్నారు.

Advertisements

Latest Articles

Most Read