ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు... ఏపీలోని పలువురు టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి... చంద్రబాబు, తెలుగుదేశం టార్గెట్ గా ఐటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపిలో కాకుండా, తెలంగాణాలో చేసారు.

tdp 15112018 2

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌ గౌడ్‌కు చెందిన సంస్థలపై ఆదాయపన్ను శాఖ మరోసారి దృష్టి పెట్టింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్న ఆయన సంస్థల్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు తాజాగా హైదరాబాద్‌లో ఆయనకు చెందిన డ్యూక్స్‌ బిస్కెట్ల కంపెనీతో పాటు స్థిరాస్తి సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచి మొత్తం 20 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ఈ కంపెనీ ప్రమోటర్స్‌ ఎవరు, ఈ సంస్థలో మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరిగాయి, కంపెనీలోకి నిధులు ఎక్కడి నుంచి తెచ్చారు.. అన్న అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

tdp 15112018 3

దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ ఉప్పల్‌ నుంచి మహాకూటమి(తెదేపా) అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి నిన్ననే ఆయన నామినేషన్‌ వేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కేంద్రాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలను ఐటీ దాడులతో వేధిస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తరుచూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేవేందర్‌గౌడ్‌కు చెందిన సంస్థలపై ఐటీ సోదాలు జరగడంతో తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే తమపై ఎలాంటి దాడులు జరిగినా భయపడేది లేదని వీరేందర్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read