వైసిపీ పార్టీ అంటేనే ఫేక్ పార్టీ అనే పేరు ఉంది. వాళ్ళ నాయకుడు కంపెనీలు దగ్గర నుంచి, తను చదువుకున్న డిగ్రీ దాకా అన్నీ ఫేక్. అందుకే వాళ్ళ నాయకుడు పంధాలో, వైసీపీ కార్యకర్తలు నడుస్తున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో ఎలా ఫేక్ చేస్తారో చెప్పే పనే లేదు. ఎక్కడో జరిగినవి, ఇక్కడ జరిగినట్టు చెప్పి, ప్రభుత్వం పరువు తియ్యటం, మార్ఫింగ్ లు చెయ్యటం, జుబుక్సాకరంగా రాతలు రాయటం, ప్రముఖల పేరుతో ఫేక్ ఎకౌంటులు ఓపెన్ చేసి, ఆ ఎకౌంటు ద్వారా చంద్రబాబుని తిట్టి, అదే నిజం అని సామాన్య ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్ని సార్లు పోలీసులు పట్టుకున్నా, సిగ్గు లేదు. తాజాగా రాష్ట్ర ప్రజలకు సరి కొత్త డైట్ ప్రచారం చేసిన, వీరమాచనేని రామకృష్ణను, వైసీపీ ఫేక్ చేసింది. ఆయన పేరుతో ట్విట్టర్ ఎకౌంటు ఓపెన్ చేసి, చంద్రబాబుని తిట్టే పోస్ట్ లు పెట్టారు. దీంతో తిక్క రేగిన వీరమాచనేని రామకృష్ణ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

vrk 15112018 2

ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం పై మాట్లాడారు "నాకు మెసేజ్ లు కొన్ని వచ్చినియ్యి. ఎవడో పిచ్చి పిచ్చిగా కొన్ని నా పేరుతో, వీరమాచనేని రామకృష్ణ డైట్ అనే పేరుతో, పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారని, పొలిటికల్ నాయకులని విమర్శిస్తా అని. నా జీవితంలో, నేను ఇప్పటి వరకు, ట్విట్టర్ ఎకౌంటు అనే మొఖం చూడలా. అసలు ట్విట్టర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అది ఎలా పని చేస్తుందో తెలియదు. కావాలనే చూడలా. నేను వాడను కాబట్టి నాకు అది అనవసరం. అలాగే ఫేస్బుక్ అనేది ఎలా ఉంటుందో నా జీవితంలో చుడలా.. నేను ఎక్కడా ఏ రిజిస్ట్రేషన్ చెయ్యలా.. నా పేరు మీద సోషల్ మీడియాలో కనిపించేవి అన్నీ దొంగ ఐడీలు, ఫేక్ ఐడీలు. నాకు బోలెడు పని ఉంది. రాజకీయ నాయకులకు, మిగితా వారికి ఎలా పని ఉందో, నా పని నాకు ఉంది. ప్రపంచమంతా తిరగాల్సిన పని ఉంది. పేపర్ చదివే తీరిక కూడా నాకు లేదు."

vrk 15112018 3

"నా జీవితంలో నేను ఒక కులానికి... చట్ట పరంగా నాకు కులం మాత్రం లేదు. నేను ఏ కులానికి, ప్రాంతానికి, మతానికి, వర్గానికి, భాషకు కూడా చెందనటువంటి కాన్సెప్ట్ తీసుకుని ముందుకు వెళ్తున్నా. మనిషిని విడదీయటానికి కులం ఉంది, మతం ఉంది, ఆర్ధిక అసమానతలు ఉన్నాయి, సినీ హీరో అభిమానం ఉంది, రాజకీయ పార్టీ అభిమానులు ఉన్నాయి. కాని ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావలి. ఆ ఎజండా బేస్ చేసుకుని, ప్రపంచాన్ని మారుద్దాం, మనం నాశనం అయినా, మన భావి తరాలకి, రోగ విముక్తి సమాజం ఉండాలని నేను నడుం కట్టి ముందుకు వెళ్తున్నా. ఈ దిక్కుమాలిన ఫేక్ గాళ్ళ పై కంప్లెయింట్ ఇచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. నా పేరు మీద ఏమన్నా పొలిటికల్ కామెంట్స్ చేస్తే, సివియర్ ఆక్షన్ తీసుకుంటా, మీకు మాములుగా ఉండదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, మీ మక్కెలు ఇరగ్గొట్టిస్తా.."

Advertisements

Advertisements

Latest Articles

Most Read