"అసలు అది ఒక పార్టీనా...ఆఫ్ట్రాల్ ఒక 0.01 శాతం పార్టీ అది.. మాకు ఆ పార్టీ ఒక పోటీనా ?" ఇది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు... అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే అన్నారు "అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో జెండా కట్టే వాడు ఉన్నాడా ? మా పార్టీ చూడండి ఎంత ధైర్యంగా తెలంగాణా తిరుగుతుందో చూడండి" అని.. తరువాత అసలు ఆయాన తెలంగాణాలో పోటీలోనే లేడు అనుకోండి, అది వేరే విషయం... ఇటు కేసీఆర్ వ్యాఖ్యలు, ఇటు పవన్ వ్యాఖ్యలు చూస్తే, అసలు తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేదు అని ఎవరైనా అనుకుంటారు. కాని అది అవాస్తవం, 15 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నా సరే, నాయకులు వెళ్ళిపోయినా సరే, తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చెదరలేదు అని తెలంగాణా ఎన్నికల ప్రచారం చూస్తే అర్ధమవుతుంది.

cbn 021122018 2

ఆంధ్రాలో కంటే, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానించే కార్యకర్తలు ఎక్కువ అని మరోసారి రుజువైంది. తెలంగాణాలో బీసీ వర్గాల్లో ఇప్పటికే, తమ జీవితాలు మార్చింది తెలుగుదేశమే అని నమ్ముతారు. తెలంగాణా సమాజంలో, సామాజిక, ఆర్ధిక మార్పులకు కారణం తెలుగుదేశం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి పార్టీని నాయకులు అందరూ వదిలి వెల్లిపోయనా కార్యకర్తలు మాత్రం వారి భుజాల మీద మోసి, నిలబెట్టారు. ఈ రోజు కేసీఆర్ వచ్చి, తమ ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం అని చెప్పకనే చెప్పారు. మరి కేసీఆర్ గారు, ఇప్పటికీ ఇది 0.01% పార్టీ అని అంటారా ? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎలాగూ పోటీ చేసే దమ్ము లేదు, మరి ఇప్పటికీ తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి జెండా కట్టేవాడు లేడు అంటారా ? నిన్న కూకట్‌పల్లి రోడ్‌షోలో ఇప్పటి వరకు ఎవరికీ రాని జనాలు, చంద్రబాబుకి వచ్చారు.

cbn 021122018 3

వాళ్ళు డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న కూలీలు కాదు, లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. తమ జీవితాలు ఇలా ఉన్నాయి అంటే, అప్పుడు మీరు వేసిన పునాదులే అని, కృతజ్ఞతగా వచ్చారు. మట్టి పిసుక్కునే చేతులతో, కంప్యూటర్ పట్టుకున్నాం, మా జీవితాలు మీ ముందు చూపు వల్లే బాగుపడినాయి అని చెప్పటానికి వచ్చారు. కూకట్‌పల్లి రోడ్‌షోలో ఎటు చుసిన జనాలే ఉన్నారు. చంద్రబాబు కూడా తన సహజ శైలికి భిన్నంగా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. "ప్రజల హృదయాల్లో నాకున్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరు. నేను ఎందుకు వచ్చానో ప్రజల ఆదరణ చూస్తే కేసీఆర్‌కు తెలుస్తుంది. మీ ఓటుతో కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. మోదీ, అమిత్‌షాలు దేశాన్ని భ్రష్టు పట్టించారు. మా హైదరాబాద్‌కు మీ అహ్మదాబాద్‌కు పోలిక ఉందా? అని మోదీని అడుగుతున్నా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను చిత్తుచిత్తుగా ఓడించాలి. అప్పుడే దేశానికి మంచి రోజులు (అచ్చే దిన్‌) వస్తాయి." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read