తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 5వ తారీఖు దాకా అక్కడే మకాం వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. నిజానికి చంద్రబాబు రెండు రోజులు మాత్రమే ప్రచారం చేద్దామని అనుకున్నారు. కాని కేసీఆర్, కేటీఆర్ రెచ్చగొట్టే మాటలతో, చివరి వారం రోజులు కీలకమని చంద్రబాబు భావించారు. వీరు చేసే తప్పుడు ప్రచారాలు, అక్కడే తిప్పికొట్టాలని, వ్యూహం మార్చుకుని, మరో అయిదు రోజులు పాటు, తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గునాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో కేసీఆర్ కి కూసాలు కదులుతున్నాయి. అదీ చంద్రబాబు హైదరబాద్ పరిధిలోనే తిరుగుతూ ఉండటంతో, హైదరాబాద్ నియోజకవర్గాల పై కేసీఆర్ పెట్టుకున్న ఆశలు, రోజు రోజుకీ పోతున్నాయి. అనవసరంగా చంద్రబాబుని రెచ్చగొట్టి, ఇక్కడ దాకా తెచ్చుకున్నాం అనే భావాన తెరాసలో ఉంది. తెలంగాణ ఎన్నికలు మహాకూటమికి ప్రతిష్టాత్మకం కావడంతో అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున కూడా ప్రచారం చేయాలని యోచిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, కేసీఆర్ టార్గెట్‌గా ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు.

kcr 03122018

రాహుల్ గాంధీతో కలసి పాల్గొన్న బహిరంగసభలతో పాటు స్వయంగా రోడ్‌షోలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు తెలంగాణకు చంద్రబాబు వస్తే ప్రతిఘటించాల్సిందిగా టీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్కడే మకాంవేసి పార్టీ విజయావకాశాలను బేరీజు వేస్తున్నారు. ప్పటి వరకు ఖమ్మం జిల్లాతో పాటు సనత్‌నగర్, నాంపల్లిలో పర్యటన పూర్తిచేసిన చంద్రబాబు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలు సక్సెస్ కావడంతో టీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కూటమి గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.

kcr 03122018

సెటిలర్లు అధికంగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్‌లో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని చెప్తున్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు నల్లేరు పై బండినడకే అని భావిస్తున్నారు. కూకట్‌పల్లితో పాటు ఈ నియోజకవర్గంలోనూ సెటిలర్లు అధికంగానే ఉన్నందున టీడీపీకి విజయావకాశాలపై అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ పోటీచేస్తున్న 13 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయం సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో సీనియర్లను నియమించారు. గత కొద్దిరోజులుగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు హైదరాబాద్‌లో మకాంవేసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read