ఆ పార్టీలో ఉన్నదే, నలుగురు అయిదుగురు నాయకులు. అందులోనూ ఆ పార్టీ, ఈ పార్టీ నుంచి వచ్చిన జుంపింగ్స్ తో నిండిపోయింది. నిజంగా పవన్ ని, జనసేనని చూసి వచ్చింది, ఇద్దరు, ముగ్గురు. వారిలో కొంచెం బుర్ర ఉన్న వాళ్ళలో ఉంది, ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు. పవన్ తో మొదటి నుంచి ప్రయాణం మొదలు పెట్టిన ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబుని, జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. అయితే ఆయన అనూహ్యంగా, ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. ఈ కీలక పరిణామంతో జనసేనలోనే కాదు, మిగతా పార్టీ వాళ్ళు కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే, విజయబాబు అంటే జెంటిల్మెన్ అనే భావన ఉంది. అందరి రాజకీయ నాయకులు లా కాకుండా, ఆయన నడవడిక ఉండేది. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న విజయబాబు రాజీనామా పార్టీ వర్గాల్లో కలకలానికి కారణమైంది.

pk vijayababu 02122018

పలువురు నాయకుల ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. అయితే తన వ్యక్తిగత కారణా వల్లే పార్టీని వీడుతున్నట్లు విజయబాబు ప్రకటించారు. ఒకటి రెండు రోజులు ఆగితేగాని అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేసినట్టు చెప్తున్నా, బలమైన కారణాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ అజెండా ఏంటో, ఇప్పటికీ క్లారిటీ లేదు. రోజుకి ఒక మాట చెప్తూ, ఏ విషయంలోనూ క్లారిటీ లేకుండా, పవన్ వ్యవహరిస్తున్న తీరు, ఇలాంటి వారికి చాలా ఇబ్బందిగా మారింది. పార్టీలో ఒకటి అనుకోవటం, తరువాత పై నుంచి వచ్చిన ఆదేశాలతో, మొత్తం అనుకున్నది మారిపోవటం కూడా, ఇలాంటి సీనియర్ నాయకులని ఇబ్బందికి గురి చేస్తుంది. మరో పక్క కేవలం ఒక్క కులానికి పరిమతం అనే భావన ఇప్పటికే బాగా వెళ్ళిపోయింది.

pk vijayababu 02122018

ఈ రోజు అనంతపురంలో కావాతు అంటూ హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు, ఇదే రోజు విజయబాబు రాజీనామా చెయ్యటంతో, గట్టి షాక్ అనే చెప్పాలి. అయితే ఇప్పటికి ఆయన ఏ విమర్శ చెయ్యకుండా వెళ్ళిపోవటం ఒక్కటే పవన్ కళ్యాణ్ కు ఊరటని ఇచ్చే విషయం. అయితే ఇప్పటికే జనసేనలో చాలా మంది లోపల లోపల నలిగి పోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు విని వీరుడు సూరుడు అని మేము డబ్బా కొట్టటం, తీరా విషయం వస్తే, చేతులు ఎత్తేయటం అయిపోయిందని అంటున్నారు. తెలంగాణా విషయంలో అదే జరిగిందని, నాకు తెలంగాణా అంటే ఇష్టం అని చెప్పి, తెలంగాణా ఎన్నికల్లో అసలు పోటీ లేకుండా చేతులు ఎత్తేసిన విషయం గుర్తు చేస్తున్నారు. అలాగే, అవినీతి పరులని దగ్గరకు రానివ్వను అని చెప్పి, రావెల లాంటి వారిని పార్టీలో చేర్చుకుని, మా తల ఎత్తకుండా చేసారని అంటున్నారు. మొత్తానికి, విజయబాబు లాంటి వారితో పాటు, మరికొంత మంది లైన్ లో ఉన్నారని, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, ఈ లిస్టు ఇంకా పెరిగిపోతుంది అనటంలో ఆశ్చర్యం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read