దళితుడ్ని సీఎం చేస్తానన్న హామీపైనా, లేదా యువకులకు ఉద్యోగాల కల్పనపైనా, లేదా డబుల్ బెడ్ రూమ్‌లను కట్టే దానిపైనా? ఏ విషయంలో తాను సీఎం కేసీఆర్‌కి అడ్డు పడ్డానో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి సవాల్ విసిరారు. సనత్ నగర్‌లో ప్రజాకూటమి ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. టీఆర్‌ఎస్ గురించి చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని తిడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ రావాలి, అందరూ ఆనందంగా ఉండాలనేదే తన కోరిక అని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని కాంక్షించారు. జీవితంలో ఎప్పుడూ చూడనంత స్పందన సనత్‌నగర్‌లో చూస్తున్నామన్నారు. కార్యకర్తల ఉత్సాహంతో తనకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయని, ఆకస్మిక తనిఖీల పేరిట వందల సార్లు హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగానని ఆయన గుర్తుచేశారు.

trs 29112018

తెలంగాణలో తాను అన్నింటికీ అడ్డంపడుతున్నానని కేసీఆర్‌ అంటున్నారని.. దళితుడిని సీఎం చేస్తానంటే తాను అడ్డుపడ్డానా? అని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. డీఎస్సీ వేస్తానంటే అడ్డుపడ్డానా?, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన చేస్తానంటే వద్దన్నానా? అని కేసీఆర్‌ను నిలదీశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఆశ చూపి ఒక్క ఇల్లు కట్టలేదని చంద్రబాబు విమర్శించారు. మహిళలకు మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుపడ్డానా? హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటే అడ్డపడ్డానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ అందరూ ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్టు నాటకాలాడుతున్నారని ఆయన చెప్పారు. ఒక పక్క బీజేపీతో, మరోపక్క ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ అంటకాగుతోందని, దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ, టీఆర్‌ఎస్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దేశం కోసమే టీడీపీ-కాంగ్రెస్‌ కలిసిందని ఆయన స్పష్టం చేశారు.

trs 29112018

పెత్తనం చేయడానికి వచ్చానని కేసీఆర్ విమర్శిస్తున్నారని, టీడీపీ పోటీ చేసేది కేవలం 13 సీట్లలోనే అయినప్పుడు పెత్తనం చేయడానికి తాను ఎందుకు ప్రయత్నిస్తానన్నారు. 37 సంవత్సరాలు టీడీపీ, కాంగ్రెస్ విపక్షంగా ఉన్నాయని, దేశ ప్రయోజనాల కోసం నేడు కలవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతిచ్చారని, అలాగే ఐటీ రంగంలో గుర్తింపు వచ్చింది చంద్రబాబు వల్లేనని చెప్పారని, కానీ ఇప్పడు మాత్రం అధికారం కోసం తనను తిడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే కేసీఆర్ మోదీతో దోస్తీ చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్ఎస్ గురించి తాను ఎన్నడైనా చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని కేసీఆర్ సంస్కారం లేకుండా తిడుతున్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. హైదరాబాద్‌లో సంపద పెరిగిందంటే, అలాగే ఐటీ రంగంలో నగరానికి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబే అని కవిత, కేటీఆర్ అన్న మాట వాస్తవం కాదా? అని చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read