ఈ రోజు ఖమ్మం, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు వచ్చిన స్పందన చూసి కేసీఆర్ కు వణుకు మొదలైంది. ఒక్క 6 గంటలు చంద్రబాబు అలా తిరిగితేనే, తెలంగాణా మొత్తం వాతవరణం మారిపోవటంతో, చంద్రబాబుకి ఇబ్బందులు పెట్టాలనే కొత్త ఎత్తుగడలు మొదలు పెట్టారు. రేపు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు రోడ్‌షో చేయదలచారు. అయితే చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అదే సమయంలో కేటీఆర్ రోడ్‌షో ఉన్నందున అనుమతివ్వలేమని పోలీసులు చెబుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రెండు రోజుల ముందే దరఖాస్తు చేసినప్పటికీ కావాలనే అనుమతివ్వలేదంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాల్లో చంద్రబాబు రోడ్‌షోను నిర్వహిస్తామని చెప్పినా, పోలీసులు అనుమతించడం లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణాలో వస్తున్న స్పందన చూసి, కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబుకు పర్మిషన్ ఇవ్వటం లేదని అంటున్నారు. ఈ రోజు ఖమ్మంలో ప్రజాకూటమి ఏర్పాటు చేసిన సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసమే టీడీపీ, కాంగ్రెస్ కలిసి ముందుకెళుతున్నాయని చంద్రబాబు తెలిపారు. దేశంలో అసహనం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని చంద్రబాబు చెప్పారు. రాహుల్‌తో టీడీపీ వేదిక పంచుకోవడం చరిత్రలో మిగిలిపోతుందని ఆయన తెలిపారు.
బుధవారం సాయంత్రం సనత్‌నగర్‌లో జరుగుతున్న ప్రజా కూటమి సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణలో తెరాస వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు వల్లే తెలంగాణ సంపద పెరిగిందని ఎంపీ కవిత చెప్పారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ హైటెక్ సిటీ అయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. 13సీట్లతో నేను ఇక్కడ సీఎంను కాలేను. ప్రజాకూటమి అధికారంలోకి రావాలి. బంగారు తెలంగాణ రావాలి. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారు. నేను అడ్డుపడ్డానా? డబుల్ బెడ్‌రూం ఇళ్లకు నేను అడ్డుపడ్డానా? మహిళలకు మంత్రి పదవి నేను ఇవ్వొద్దని చెప్పానా? తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ఆగస్టులోనే ప్రణాళిక రూపొందించారు. నరేంద్రమోదీ సహకారంతోనే ఎన్నికల నిర్వహణ జరుగుతోంది.’’ అని అన్నారు.