ప్రపంచంలో అతి పెద్ద సోలార్ పార్కగా కర్నూలు అవతరించబోతోంది. పార్క సామర్ధ్యం మేర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సౌరఫలకాల ఏర్పాటు పూర్తి కాబోతుంది. ఇప్పటికే 90% వరకు సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్ల పూర్తయ్యాయి. తమిళనాడులోని రామనాధపురంలో అదానీ సంస్థ నిర్మించిన సోలార్ పార్కే(648 మెగావాట్లు) ఇప్పటి వరకూ ప్రపంచంలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. కర్నూలు పార్క సామర్ధ్యం వెయ్యి మెగావాట్లు కావడంతో దాని కంటే పెద్దది కాబోతోంది. కర్నూల్ సోలార్ పార్కులో సన్ ఎడిసన్ అనే సంస్థ 2015 నవంబరులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టెండరును దక్కించుకుంది.

solar 29112018

యూనిట్ విధ్యత్ కు రూ.4.64 ధరను ఆ సంస్థ కోట్ చేసింది. దేశంలోనే ఇప్పటి వరకు అదే తక్కువ ధర. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సన్ ఎడిసన్ సౌర విద్యుత్ యూనిట్ల నిర్మాణం చేపట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సన్ ఎడిసన్ నుంచి ఈ బాధ్యతను గ్రీన్ కో అనే సంస్థ తీసుకుంది. సౌర విద్యుత్ యూనిట్ల పనులను ముమ్మరం చేసిన గ్రీన్ కో ఏప్రిల్ నాటికి 500 మెగావాట్ల స్థాపక సామర్థ్యాన్ని నెలకొల్పబోతోంది. 2015 డిసెంబరులో అదే ధర(యూనిట్ రూ. 4.64 పైసలు)కు సాఫ్ట్ బ్యాంకు కర్నూలు సౌర పార్కులోనే 350 మెగావాట్ల సౌర విద్యుత్ టెండరును చేజిక్కించుకుంది. టెండరు దక్ష్కించుకున్న దగ్గర నుంచీ దాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలన్న తపనతోనే సాఫ్ట్ బ్యాంకు పని చేస్తూ వస్తోంది.

solar 29112018

అయితే కర్నూల్ ప్లాంట్ లో జరుగుతున్నా పనుల పై సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ, MarceloClaure, తన ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు. "This morning I had a chance to visit our solar park at #Karnool in #AndhraPradesh in #India I am so impressed by the magnitude of our project and by our amazing team" అంటూ ట్వీట్ చేసారు. కర్నూలులో 1000, అనంతపురం జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జల, బొగ్గు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కంటే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సులభం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాక బీడు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలకు అవకాశం కల్పించింది. ఏపీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఈ పనులను పర్యవేక్షిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read