టీడీపీ సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో మంగళవారం విస్తృత ప్రచారం జరిగింది. సాక్షాత్తు అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ సన్యాసి పాత్రుడు(జమీలు) కుట్ర పన్నినట్టు ఈ ప్రచారం జరిగింది. రాజకీయంగా టీడీపీకి, వ్యక్తిగతంగా అయ్యన్నకు వ్యతిరేకులతో ఆయన సోదరుడు జమీలు చనువుగా ఉన్నట్టుగా ఉన్న ఈ వీడియోను వాట్సప్ ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చారు. వామపక్ష పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులతో అయ్యన్న సోదరుడు జమీలు చనువుగా పలుకరిస్తూ వారిని అనుసరించినట్టుగా వీడియో చిత్రాలు ప్రచారంలోకి వచ్చాయి.

ayyana 28112018 1

ఇటీవల మంత్రి అయ్యన్న కుమారుడు విజయ్‌కు బాబాయ్ జమీలుకు మధ్య స్వల్పంగా విబేధాలు పొడసూపాయంటూ ప్రచారం జరిగింది. నగరంలో పార్టీ కార్యక్రమాలను విజయ్ ఒంటెత్తు పోకడలతో నిర్వహిస్తున్నాడంటూ అయ్యన్న సోదరుడు జమీలు సాక్షాత్తు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అయ్యన్న కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలు పొడసూపినట్టు విస్తృతంగానే ప్రచారం జరిగింది కూడా. ఈ నేపథ్యంలో అయ్యన్న రాజకీయ వ్యతిరేకులతో సోదరుడు జమీలు చనువుగా మెలగుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి అయ్యన్న హత్యకు తాను కుట్ర పన్నుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని సోదరుడు జమీలు ఖండించారు.

ayyana 28112018 1

ఈమేరకు ఆయన తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి కారకులు ఎవరో దర్యాప్తు చేయాలని కోరుతూ జమీలు జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబంలో కలతలు సృష్టించేందుకే ఈవిధంగా కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి జమీలు వివరించారు. ఇటీవల ఒక ముస్లిం కుటుంబంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా సీసీ టీపీ పుటేజీని మార్ఫింగ్ చేసినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చిత్రాల్లో కనిపిస్తున్నట్టు వైసీపీ నేతలు ఎదురైనప్పుడు మర్యాద పూర్వకంగానే పలుకరించిన దృశ్యాలను వక్రీకరించారంటూ అనుమానం వ్యక్తం చేశారు. జరుగుతున్న కుట్రకు బాధ్యులను గుర్తించాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో అయ్యన్న సోదరుడు కోరారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం విస్తృత రాజకీయ చర్చనీయాంశంగా మారడంతో పోలీసు వర్గాలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read