ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి విషయంలో తన మిత్రుడైన జీపీ రెడ్డిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, అర్ధరాత్రి ఈ సోదాలేంటని ప్రశ్నించారు.

lagadapati 09112018 2

సెర్చ్ వారెంట్ లేకుండా అర్ధరాత్రి వచ్చి పోలీసులు హడావడి చేస్తున్నారని, ఐపీఎస్ అధికారి నాగి రెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని లగడపాటి అన్నారు. పోలీసుల తీరు పై గవర్నర్, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. పాత కేసు పట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వారెంట్ లేకుండా, అర్ధరాత్రి ఇళ్ళలో చొరబడి సోదాలు చేయమని చట్టం చెబుతోందా అంటూ పోలీసులని ప్రశ్నించారు. సివిల్ కేసుకు సబందించి విచారణకు వచ్చామంటూ పోలీసులు చెప్పటాన్ని, లగడపాటి తీవ్రంగా విభేదించారు.

lagadapati 09112018 3

ఎలాంటి వారెంట్ చూపించకుండా ఇంట్లోకి వచ్చిన పోలీసులతో లగడపాటి వాదనకు దిగారు. సెర్చ్ వారెంట్ ఉంటే చేసుకోండి, కానీ అర్ధరాత్రి పూట ఇళ్ళల్లో చొరబడి, ఫ్యామిలీలు ఉన్న చోట, పిల్లలు ఉన్న చోట, ఈ రాద్ధాంతం ఏంటి అని, ఎవరి ఆదేశాల ప్రకారం ఇలా చేస్తున్నారని లగడపాటి ప్రశ్నించారు. వెస్ట్ జోన్ డీసిపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు హడావిడి చేసారు. తెలంగాణాలో ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి, ఇలాంటి దాడులు ఎక్కువ అయిపోయాయి. ప్రత్యర్ధుల పై, కావాలని విరుచుకుపడుతూ, పాత కేసులు తిరగతోడి, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పైన బీజేపీ, ఇక్కడ కేసీఆర్, ఇద్దరూ కలిసి, తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు, సానుభూతి పరుల పై, ప్రతి రోజు ఎదో ఒక హడావిడి చేసి, హంగామా చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read