వైఎస్ జగన్ బాల్య స్నేహితుడు, వైఎస్ ఫ్యామిలీ ఇంట్లో మనిషి అయిన, కడప జిల్లా పులివెందులకు చెందిన మంగలి కృష్ణ కిడ్నాప్ అయ్యాడని, ఈ రోజు సాయంత్రం వార్తా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇదంతా మీడియాని డైవర్ట్ చెయ్యటానికి, మంగలి కృష్ణ అనుచరులు ఆడిన డ్రామా అని పోలీసులు తేల్చారు. ఇది అసలు జరిగిన విషయం.. కొద్ది రోజులుగా మంగళి కృష్ణ అనుచరులు హైదరాబాద్‌లోని ఒక వ్యాపారిని బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరంగం సృష్టించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలంటూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మంగళి కృష్ణ అనుచరులు ఒత్తిడి తెచ్చారు. ఆ వ్యాపారి ఇంట్లోకి చొరబడి కారు, వస్తువులు ధ్వంసం చేశారు.

krishna 081112018 2

దీంతో మంగళికృష్ణపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణపై దౌర్జన్యం, దాడి, భూకబ్జా ఆరోపణలపై పలు కేసులు ఉన్నాయి. దేశ, విదేశాల్లో నిర్మాణ వ్యాపారాలు నిర్వహించే దుర్గారావు, ఆయన కుమారుడు సుభాష్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి ఇంట్లో కొందరు చొరబడి కారు, అద్దాలు, లైట్లు ధ్వంసం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్‌ను గుర్తించారు. సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్, వీరబాబు, ప్రతాప్‌లతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు సమీర్ అంగీకరించాడు. పులివెందులకు చెందిన మంగళికృష్ణ ఆదేశాల మేరకు దాడి చేసినట్లు చెప్పాడు.

krishna 0811120183

వ్యాపారంలో తనకు భాగస్వామ్యం ఇవ్వాలని మంగళికృష్ణ కొంతకాలంగా బెదిరిస్తున్నాడని సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుభాష్ ఫిర్యాదు మేరకు మంగళికృష్ణ, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సమీర్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఈనెల 5న అరెస్టు చేశారు. ఈ కేసులో మంగళికృష్ణ ఇవాళ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అనంతరం మంగళికృష్ణకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కృష్ణను కిడ్నాప్ చేశారంటూ అతని అనుచరులు కొంతసేపు హంగామా సృష్టించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read