వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై కామెంట్లు చేయడంపై సెటైర్లు వేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... రోజా వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన... రోజా మహాతల్లి... నా మీద ఎందుకు మండి పడుతుందో తెలీదు అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహాయంతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు అనుకుంటే ప్రజలు హర్షించరని చెప్పారు. మళ్లీ సీఎం కావడానికి రాహుల్ ను కలవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని అన్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీకి ఉన్న బలం చాలని చెప్పారు. పొత్తుల కోసం, ఓట్ల కోసం ఆరాటపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకే కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారని చెప్పారు.

roja 08112018 2

మహాకూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారని అన్నారు. స్వామి ప్రబోధానంద ఓ ఫ్యాక్షనిస్టని, ఆయనతో తనకు రాజీ ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారన్నారు. ఏపీలో గెలుపు కోసం తెదేపా ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.

roja 08112018 3

దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి అనివార్యమైందని వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ ఫ్యాక్షనిస్టుగా మారి ఏపీ ప్రజలను వేధిస్తున్నారని జేసీ మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను సైతం వెనక్కు తీసుకుని.. ఏపీపై కక్షసాధింపు చర్యలను ప్రధాని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ గొంతు బలంగా ఉందేమో గానీ..వ్యక్తిగా మాత్రం ఆయన బలహీనంగా కనిపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ భాజపాకు భంగపాటు తప్పదని జేసీ పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read