ఇనుప ఖనిజం అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులు, రాష్ట్రాల సరిహద్దుల చెరిపేశాడనే ఆరోపణలు తదితర కేసుల్లో కూరుకుపోయిన పీకల్లోతు కష్టాల్లో ఉండే గాలి జనార్దన్‌రెడ్డి తాజాగా మరో కేసు మెడకు తగిలించుకున్నారు. ఒక ప్రైవేటు కంపెనీ మనీ లాండరింగ్‌లో దాదాపు వేల కోట్ల మేరకు ప్రజలను మోసం చేస్తే దాన్ని సీసీబీ గుర్తించి ఆ కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు పూనుకున్న సమయంలో గాలి జనార్దర్‌రెడ్డి తన జాదూతనం ప్రదర్శించారు. తాజాగా ఈ కేసులో ఇరుక్కున్న గాలి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని సీసీబీ పోలీసులు తెలిపారు.
గాలి జనార్దనరెడ్డి ఆచూకీ కోసం సీసీబీ పోలీస్ అధికారి మంజునాథ్ నేతృత్వంలో 8 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గురువారం ఉదయం బళ్లారికి చేరుకున్నారు. మొదట ఇన్నా రెడ్డి కాలనీలో ఉన్న గాలి ఇంటికి వెళ్లి చూశారు. అక్కడి నుంచి బెళగల్లు గ్రాస్ లోని ఓ అపార్టుమెంట్లో అలీ ఖాన్ ఇంటినీ పరిశీలించారు. ఉదయం 8 గంటలకు హవంబావిలో ఉన్న గాలి ప్రధాన నివాసానికి వచ్చారు. వాచ్మన్ సాయంతో తాళం తీయించి లోనికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న గాలి జనార్ధన రెడ్డి మామ పరమేశ్వర రెడ్డి, అత్త నాగ లక్ష్మమ్మ అక్కడికి చేరుకున్నారు.
మరో 10 నిమి షాల్లో గాలి మిత్రుడు- మొళకాల్మూరు శాసనస భ్యుడు బి. శ్రీరాములు (భాజపా), రాయదుర్గం మాజీ శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి (వైకాపా) అక్కడికి వచ్చారు. మరో వాహనంలో కొందరు మహిళలు ప్రవేశించారు. 6 గంటలపాటు పోలీసులు ఏకబికిన ఇల్లంతా గాలించారు. ఇంటి పైభాగంలో ఉన్న ట్యాంక్, పడక గదులు, స్నానపు గదులు, స్టోర్లను పరిశీలించారు. అక్కడి నుంచి ఓబుళాపురం గనుల సంస్థ (మైనింగ్ కంపెనీ) కార్యాలయం, దాని ఎదురుగా ఉన్న ఏఎంసీ గనుల కార్యాలయాలనూ అధికారులు తనిఖీ చేశారు. ఏయే దస్త్రాలు స్వాధీనం చేసుకున్నదీ వెల్లడి కాలేదు. ఇది ఇలాఉండగా, కమలదళం మాత్రం గాలి జనార్దన్‌రెడ్డి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, బీజేపీ నాయకులుకూడా ఆయన దూరంగా ఉండాలని స్వయానా పార్టీ ఆధినాయకుడు అమిత్‌షా పేర్కొన్నారు.