కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి, తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాల్లో కూటమి, అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పై ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపి సీఎంల భేటి జరుగనుంది. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో ముఖ్యమంత్రి భేటి కానున్నారు. జాతీయ స్థాయిలో భాజాపా యేతర రాజకీయ పార్టీలన్నింటినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయి నాయకులతో మంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని దేవెగౌడతోనూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను అభినందించారు. రోజు రోజుకీ దేశంలో భాజాపా ప్రతిష్ఠ దిగజారిపోతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో ఇటీవల మూడు లోక్‌సభ స్థానాలు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో భాజపాకు గట్టి షాక్ తగిలింది. ఈ ఫలితాల్లో నాలుగు స్థానాలను కాంగ్రెస్- జేడీఎస్ కూటమి గెలుచుకోగా.. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో మాత్రమే భాజపా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కుమారస్వామికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కాగా, ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని దేవెగౌడతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తోంది.
కర్ణాటక ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే భాజపా విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.