అది రిపబ్లిక్ అఫ్ బళ్ళారి.. వైఎస్ఆర్ దత్త పుత్రుడు, జగన్ అన్నయ్య అయిన, గాలి జనార్ధన్ రెడ్డి సామ్రాజ్యం.. అక్కడ అంతా గాలి హవానే. ఎన్ని ప్రభుత్వాలు మారినా, గాలి బ్రదర్స్, బళ్ళారిని తమ సామ్రాజ్యంలా అనుకుంటారు. అయితే ప్రజాస్వామ్యం ముందు, ప్రజల తీర్పు ముందు, హేమా హేమీలే, తల వంచాల్సిన పరిస్థితి. ఈ రోజు కూడా బళ్ళారిలో అదే జరిగింది. ఎక్కువ మంది తెలుగు వారు ఉండే బళ్ళారిలో, గాలి సామరజ్యానికి గండి పడింది. 2004 నుంచి బళ్లారి పార్లమెంట్ స్థానాన్ని శాసిస్తున్న బీజేపీకి ఈసారి ఘోరపరాభవం ఎదురైంది. ఉప ఎన్నికలో బళ్లారి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ వశమైంది. దీంతో గాలి బ్రదర్స్ ఆధిపత్యానికి కాంగ్రెస్ చెక్ పెట్టినట్లయింది. బళ్లారి లోక్ సభకు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప ఏకంగా 2,43,161 ఓట్ల తేడాతో బీజేపీని మట్టికరిపించారు.

jagan 06112018 2

అయితే బళ్ళారిలో జరిగింది, రేపు పులివెందులలో కూడా జరుగుతుందా, అని విశ్లేషకులు చెప్తున్నారు. 40 ఏళ్ళు ఆ కుటుంబం, పులివెందులని ఏలింది... తాత సిల్వర్ స్పూన్ తో పుట్టాడు అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు... తండ్రి, ముఖ్యమంత్రిగా కూడా చేసారు... ఇక మనోడు అయితే, ఎంపీగా చేసి, నాలుగేళ్ల నుంచి ఎమ్మల్యేగా చేస్తున్నాడు... ఆ ఊరికి చేసింది ఏంటి అంటే, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి.. అలాంటి పరిస్థుతుల్లో, తన ప్రధాన ప్రత్యర్ధి ఊరికి నీళ్ళు ఇచ్చే, నా ఊరికి నీళ్ళు తీసుకువెళ్తా అని చెప్పిన చంద్రబాబు, చేసి చూపించారు... కరువు కాటకాలకు నిలయమైన పులివెందుల ప్రాంతంలో 40 ఏళ్ళ రైతుల నిరీక్షణ, తీరింది. పులివెందుల అంటే గుర్తు వచ్చేది వైఎస్ ఫ్యామిలీ.... కాని వారు ఇప్పటి వరకు పులివెందులకు ఏమి చేసారు అంటే ? అక్కడి ప్రజలే చెప్తారు...

jagan 06112018 3

పులివెందుల అంటే ఫ్యాక్షనిస్టులు అనే విధంగా తయారు చేసింది వైఎస్ ఫ్యామిలీ... కాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి పులివెందుల పై ప్రత్యెక శ్రద్ధ చూపించారు... కత్తులతో కాదు, అభివృద్ధితో వశం చేసుకుంటా... నీళ్ళు ఇచ్చి వారి మనసులు కొల్లగొడతా అంటూ చెప్పి మరీ, పులివెందులకు నీళ్ళు ఇచ్చారు చంద్రబాబ... రాజకీయంగా చూసుకుంటే, పులివెందుల మెజారిటీ పైనే, కడప ఎంపీ సీటు కూడా ఆధారపడి ఉంటుంది అంటే, అంత మెజారిటీ వస్తు ఉండేది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్‌ తన మార్క్‌ని ప్రదర్శించేవారనీ, అవసరమైతే సామ- దాన- భేద- దండోపాయాలను ప్రయోగించేవారనీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే జగన్ హాయంలో అంతా రివర్స్ లో ఉంది వ్యవహారం.. చివరకి సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేని దీని స్థితికి పడిపోయాడు జగన్.. ఎప్పుడూ లేనిది వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఓటమి అంటే ఏంటో తెలిసి వచ్చింది. దీనికి ప్రధాన కారణం జగన్ వైఖరి. ఈ మైనస్ ఉండగానే, చంద్రబాబు అభివృద్ధి అనే మంత్రంతో, పాజిటివ్ ఫీల్ తో పులివెందుల ప్రజలకు చేరువ అయ్యారు. జగన వైఖరి, చంద్రబాబు అభివృద్ధితో, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ కంచు కోటకు బీటలు ఇప్పటికే వచ్చాయి. వైఎస్ వివేక ఓటమితోనే అది రుజువైంది. ఈ రోజు బళ్ళారి ఫలితమే, రేపు పులివెందులలో వచ్చినా ఆశ్చర్యం లేదని మాటలు వినిపిస్తున్నాయి. చూద్దాం ప్రజలు ఏ తీర్పు ఇస్తారో..

Advertisements

Advertisements

Latest Articles

Most Read