గాలి జనార్ధనరెడ్డి... జగన్ మోహన్ రెడ్డికి దేవుడు ఇచ్చిన అన్నయ్య... ఇద్దరూ కలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసి కొల్లగొట్టారో అందరికీ తెలిసిందే... ఇద్దరూ జైలు జీవితం అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు... అయితే జగన్ మాత్రం ప్రతి రొజూ బయటే తిరుగుతున్నా, గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం, 4 ఏళ్ళ నుంచి ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చింది లేదు... సంవత్సరం క్రితం, కేంద్రం నుంచి వచ్చిన అభయంతో 4 ఏళ్ళ తరువాత మీడియా ముందుకు వచ్చారు.. అదీ తన మూడవ ప్రత్యర్ధి అయిన ABN రాధాక్రిష్ణ దగ్గరకు వచ్చారు... ఇలా ఉంటూ ఉండగానే, కర్ణాటక ఎన్నికలు రావటం, తాను అక్రమంగా సంపాదించిన సొమ్ము, బీజేపీ తరుపున నుంచున్న వారి కోసం ఖర్చు పెట్టటం జరిగిపోయాయి.
నిన్నటికి నిన్న కూడా, గాలి జనార్ధన్ రెడ్డి సామ్రాజ్యం అయిన, బళ్ళారిలో, ఘోర ఓటమి చవి చూసాడు. తన సామ్రాజ్యం అనుకున్న చోటే, గాలిని ప్రజలు ఘోరంగా ఓడించారు. అయితే ఇది జరిగిన 24 గంటలు గడవక ముందే, ఇప్పుడు గాలి గురించి నేషనల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గుప్పు మంటుంది. ఆ కధనం ప్రకారం, గాలి జనార్ధనరెడ్డి పరారీలో ఉన్నాడు. గాలి జనార్ధనరెడ్డిని పట్టుకోడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అంబిడెంట్ అనే కంపెనీని ఈడీ నుంచి కాపాడటానికి, ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకున్న గాలి. ఈడీ అధికారికి కోటి లంచం ఇచ్చిన గాలి.
అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారం కడ్డీలు అందుకున్న గాలి. బళ్ళారిలో ఈ నిధులు, బంగారం. బద్దలైన గాలి పాపాలు. గాలి కోసం గాలిస్తున్న సీసీబీ పోలీసులు. గాలితో పాటు మరో ముగ్గురుని కూడా పట్టుకోవటానికి గాలిస్తున్న పోలీసులు. గాలి జనార్ధన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయ నాయకుడుతో దగ్గరి సంబంధాలు ఉండటంతో, ఆ యువ నేత ఎస్టేట్, ప్యాలెస్ లో కూడా, పోలీసులు గాలించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, పాపాలు చేసిన వాడు, ఎప్పటికైనా ఇలా దొంగ లాగా తిరాగాల్సిందే. ప్రస్తుతం, కండీషనల్ బెయిల్ పై తిరిగిన వారే పరిస్థితి కూడా తొందరలోనే ఇలా ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు https://www.facebook.com/news9live/videos/335594130583944/