ఈగలు వచ్చినా, దోమలు వచ్చినా చంద్రబాబే.. తన కారే వెళ్లి లారీని ఢీ కొట్టినా చంద్రబాబే.. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిదానికి చంద్రబాబు పనేనని చెప్పడంలో ఎందుకు తాపత్రయపడుతున్నారు? సర్వం చంద్రబాబే అనే భావన తేవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ ఇద్దరు ఎలాగైనా చంద్రబాబును చెడు చేయాలని మంచి చేస్తున్నారా? తెలంగాణ ప్రచారంలో సెంటర్ పాయింట్ ఎవరు? ఏపీలో జగన్ సభకు ఆవును పంపింది ఎవరు? పవన్ కాన్వాయ్ కారు లారీని ఢీ కొ్ట్టడానికి కారణం ఎవరు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రాజకీయమిది.
తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం టీఆర్ఎస్ ఎలా ఉపయోగించుకుంటుందో.. అంత కంటే ఎక్కువగా జగన్, పవన్‌లు చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు. బాబుపై ఆరోపణలు చేయడానికి వారు చిన్నదా.. పెద్దదా.. అని చూడ్డంలేదు. ఏదైనా తమకు ఇబ్బంది కలిగింది అంటే దానికి కారణం చంద్రబాబే అంటున్నారు. పోరాట యాత్రను పవన్ శ్రీకాకుళం జిల్లా ప్రారంభించారు. అప్పటికే బాబు, లేకేష్‌లను ఆయన వ్యక్తిగత శత్రువులుగా భావించారు. పలాస పోరాటయాత్రకు వెళ్లి ఓ కళ్యాణ మండపంలో బస చేశారు.
అప్పుడు కరెంట్ పోయింది. ఆ తర్వాత కవాతు చేస్తున్నప్పుడు కొన్ని గెదెలు పోరాట యాత్రకు ఎదురొచ్చాయి. ఆ కవాతు చూసి గెదెలు బెదిరాయి. కరెంట్ పోవడానికి, గెదెలు రావడానికి చంద్రబాబు కుట్రే కారణమని పవన్ విమర్శించారు. అదే తరహాలో జగన్ కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన విజయనగరం శివారులో పాదయాత్ర చేసి మాట్లాడుతున్న సమయంలో ఓ ఆవు వచ్చింది. ఇరుకు రోడ్డులో సభ జరుగుతున్న ప్రాంతంలో ఆవు ఇరుక్కుపోయింది. దాన్ని పక్కకు పంచించి.. దాన్ని చంద్రబాబే పంపారని జగన్ ఆరోపించారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమని ఆరోపించడంలో వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదిరినట్లుగా ఉంది. Source:andhrajyothy