ఎమ్మెల్యేల పనితీరు పై ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారా...? 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రారంభించారా..? గెలుపు గుర్రాల వేటలో బాబు బీజీగా ఉన్నారా...? సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పై వాయిస్ కాల్స్ తో ప్రజలనాడీని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా...? ప్రజలకు మూడుప్రశ్నలు వేసి సరైన సమాధానాలు రాబడుతున్నారా...? సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకోవడం సాధ్యమేనా...? ఇదే అంశం కొద్ది రోజులుగా టిడిపి వర్గాల్లో చర్చనీయాంశం అయింది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాలనిభావిస్తున్న చంద్రబాబునాయుడు 175 నియోజకవర్గాల్లో గెలుపుకై కసరత్తు ముమ్మరం చేసినట్లు వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సర్వేల ద్వారా తెలుస్తోంది.
ఎమ్మె ల్యేల గెలుపు ఓటములను నిర్దేశించే క్షేత్రస్థాయి ఓటర్లలో ఎమ్మెల్యేల పనితీరు పై అంచనాకు రావడం, కార్యకర్తలలో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీల పై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయే తెలుసుకోవడంలో భాగంగా యంత్రాంగం నర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. మూడు ప్రశ్నలను బాబు వాయిస్ తో కార్యకర్తల ఫోన్లకు వాయిస్ మేసేజీలు వంపి వారి అభిప్రాయాలు నేరుగా తెలుసుకుంటున్నారు. మీ ఎమ్మెల్యే వనితీ పట్ల మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా..?,మీ ఎమ్మెల్యే అందరి కలుపుకుని పనిచేస్తున్నారా..?ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల చక్కగా అమలు చేస్తున్నారా...? అనే అంశాల పై సర్వేబృందం క్రీయశీ కార్యకర్తలకు వాయిన్ మేసేజ్ పంపి సమాచారం సేకరించడంతో పాట వారి అభిప్రాయాలను క్రోడీకరించి అధినేతకు నియోజకవర్గాల వారి నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్ సర్వేతో కొంతమంది ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా గ్రామదర్శిని, జన్మభూమి, సభ్యత్వ నమోదు, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా వ్యవహరించని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 2-3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే తరుణంలో నేరుగా టీడీపీ క్రియాశీలక కార్యకర్తలతో అధినేత చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం! కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లు ఇప్పుడున్న జూనియర్లతో సర్దుకోలేక పోతున్నారు. సీనియర్, జూనియర్లను ఎమ్మెల్యే సమన్వయ పర్చడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై ఐవీఆర్‌ఎస్‌లో వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ విధమైన పరిణామాలకు దారితీస్తోందనని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.