మొన్న రేవంత్ రెడ్డి మీద ఐటి రైడ్ లు చేసి, వెయ్య కోట్లు అని ప్రెస్ కి లీక్ ఇచ్చారు... అలాగే సియం రమేష్ పై దాడులు చేసి, నాలుగు వేల కోట్లు అని లీక్ ఇచ్చారు... తీరా చూస్తే అక్కడ ఏమి లేదని, ఊపుకుంటూ వెళ్లారు. నిన్న సుజనా పై కూడా, 6 వేల కోట్ల అంటూ ప్రెస్ నోట్ ఇచ్చింది ఈడీ. అయితే మొన్నటి వరకు పత్రికల్లో 300 కోట్లు బ్యాంక్ లోన్ కట్టలేదు అని వచ్చిన వార్తలు కాస్తా, 6 వేల కోట్లు అయిపోయాయి. అయినా, ఇక్కడ కరప్షన్ కేసు కాదు. వ్యపారంలో వచ్చే సివిల్ కేసు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోకుండా, ఏ కంపనీ నడవదు. అప్పులు లేకుండా వ్యాపారం చేసిన వారు ఎవరైనా ఉన్నారా ? మోడీ ప్రియ సన్నిహితులు అయిన అంబానీ, ఆదానీ కూడా అప్పులు తీసుకుని వ్యాపారాలు చేసే వారే. అప్పులు తీర్చకపోతే బ్యాంకు లు జప్తు చేసుకొని అప్పులు జమ చేసుకుంటాయి. సుజనా విషయంలో, అసలు ఏ బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చిందో, ఇప్పటి వరకు ఈడీ చెప్పలేదు. ఇవన్నీ చెప్పకుండా 6 వేల కోట్లు ఎగవేత పై దర్యాప్తు జరుపుతున్నాం అంది. ఇది పట్టుకుని సాక్షి, హడావిడి చేస్తుంది. దీని పై సుజనా చౌదరి ఈ రోజు మీడియాతో తన వివరణ ఇచ్చారు.
‘‘30ఏళ్ల క్రితం నేను రెండు కంపెనీలు స్థాపించాను. సుజనా యూనివర్స్‌ల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజన మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లను స్థాపించాను. సుమారు 11 సంవత్సరాల క్రితం ఒక కంపెనీ నుంచి విడిపోయి మూడో కంపెనీ వచ్చింది. గత 29 సంవత్సరాల నుంచి ఈ కంపెనీల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఉంటాయి. వెస్ట్రన్ కంపెనీలో నేను డైరెక్టర్‌ను కాను. మా మిత్రులు డైరెక్టర్లు. ఈడీ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పన్ను రిటర్నులు కూడా ఫైల్ చేస్తున్నాం. 2015 వరకు కూడా ఆ కంపెనీలు వడ్డీలు చెల్లించాము. మొన్న అధికారులు వచ్చినా నేను పట్టించుకోలేదు. ఇదేదో సాధారణ తనిఖీలుగా భావించాను. వీళ్లు ఇంత దారుణంగా వాంగ్మూలం ఇచ్చాక అసలు వివరాలేంటో అని తెలుసుకున్నాను. నాలుగైదు ఏళ్ల నుంచి స్టీలు, విద్యుత్తు రంగాలు కష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ అప్పు తీసుకోవడం అనేది నేరం ఏమీ కాదు. బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇవ్వడానికి. చెల్లించిన పన్నులు, పవర్ బిల్లులు, బ్యాంకులకు చెల్లించిన వడ్డీల మొత్తాన్ని చూస్తే ఇప్పుడున్న బకాయిల కంటే ఎక్కువే వస్తుంది. ఈడీ కొత్తగా కనుగొంది ఏమీలేదు. బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న మొత్తాన్ని వారు పేర్కొన్నారు.’’
‘‘గత తొమ్మిది నెలల నుంచి అనేక జాయింట్ లెండర్స్ మీటింగ్‌లు జరుగుతున్నాయి. పరిష్కార ప్రక్రియ జరుగుతోంది. ప్రమోటెడ్ డైరెక్టర్‌గా నేను, శ్రీనివాస్‌రాజు ఉన్నాం. కంపెనీలకు 20 ప్రదేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్స్ అన్నాక లాభనష్టాలు రెండూ ఉంటాయి. కేవలం లాభాలే ఉండవు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, సెయిల్ వంటి సంస్థలే నష్టాల్లోకి వెళ్లాయి. ఎందుకు..? 29ఏళ్లు నా కంపెనీలు సక్రమంగానే ఆడిట్ నిర్వహించాను. డమ్మి కంపెనీలు అంటే ఏంటో నాకు తెలియదు. ఆయా కంపెనీలతో నాకేంటి సంబంధం..? 2010 తర్వాత నేను నాన్ ఎగ్జిక్యూటీవ్‌గా మారిపోయాను. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మా కంపెనీ నుంచి తీసుకోలేదు.. వాడుకోలేదు. మా కంపెనీలు తప్పు చేశాయని నేను అంగీకరించను. కార్ల వివరాలు కూడా ఇస్తాను. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఎటువంటి సమస్యలు లేవు. ఎటువంటి సమాచారం కావాలన్నా మా కంపెనీలకు వెళ్లండి.. అక్కడ మా డైరెక్టర్లు ఉన్నారు. ఈడీ విషయం కూడా కనుక్కొని మీకు సమాచారం ఇస్తాను. సమన్ల విషయంలో పొరబాటు జరిగిందని ఈడీ అధికారులు నాతో అన్నారు.’’
‘‘నా కంపెనీల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగలేదు. ఇది సివిల్ వివాదం. మా కంపెనీల్లో మూడు కంపెనీలు మాత్రమే ఎన్‌పీఏలు అయ్యాయి. సుజనా గ్రూప్ కింద మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. మా డైరెక్టర్లకు నేను ఎప్పుడూ ఈ-మెయిల్స్‌లో సూచనలు చేయలేదు. బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న రూ.5,700 కోట్లు అని ఒక్కరోజులో తేల్చేశారు. 2009 తర్వాత నాపై ఆరోపణలు మొదలయ్యాయి. నేను పోటీలోకి దిగాక నాపై ఆరోపణలు చేశారు. నేను మంత్రి అయ్యాక ఆరోపణలు చేశారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో చేస్తున్నారు.’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రేవంత్ కాని, సియం రమేష్ కాని, సుజనా కాని, ఈ సోదాలు, కేసుల పై ప్రతి విషయం వివరంగా వచ్చి ప్రెస్ కి చెప్పారు. మరి ఏనాడైనా, జగన్ తన ఆస్తుల గురించి, కేసుల గురించి, ఇలా వివరణ ఇచ్చాడా ? ఇక్కడే తెలిసిపోతుంది ఎవరు ఏంటో. ఎవరు తప్పు చేసినా, అనుభవిస్తారు. ఎంత లేట్ అయినా, సరే అనుభవించే వెళ్తారు.