మాట్లాడితే నేను హైదరాబాద్ ను ఎక్కడికో తీసుకువెళ్ళాను అంటూ ట్విట్టర్ లో డబ్బా కొట్టే కేటీఆర్ కి, షాక్ ఇచ్చారు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్. తన స్నేహితుడుకి జరిగిన ఘటన కేటీఆర్ కు ట్వీట్ చేసి, ఇది హైదరాబాద్ లో ఉన్న దుస్థితి అంటూ బాధపడ్డారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు దర్శకుడు నాగ్ అశ్విన్. కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఆయన స్నేహితుడు ఒకరు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను చనిపోయారు.
దీంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ అశ్విన్ తన స్నేహితుడి పట్ల జరిగిన దారుణాన్ని వివరించారు. ‘ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా స్నేహితుడు చనిపోయాడు. అతనికి ప్రమాదం జరిగినప్పుడు చికిత్స నిమత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఎవరూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రిలో కాకుండా మరేదన్నా ఆస్పత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు."
"తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించి మనుషులు ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేం? ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్ సర్. వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీని గురించి నాకు ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకావడంలేదు సర్. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు అశ్విన్. ఈ విషయంపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది.