కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ప్రస్తుతం సిబిఐలో నెలకొన్న వివాదాలు, మోడీ-షా కనుసన్నల్లో సీబీఐ నడుస్తూ ఉండటంతో, చాలా మంది ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మద్దతు ప్రకటించారు. అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.

jd 16112018 2

సీబీఐలో పని చేసిన ఆయన, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. చట్టం ప్రకారం సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసే అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. అయితే ఎందుకు రద్దు చేశారో సరైన కారణం చెప్పాలి అని చెప్పారు. ఇప్పుడు సిబిఐ పై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే అని, అయితే ఒక సంస్థ పై ఆరోపణలు వస్తే, ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనడం సరికాదని అన్నారు హితవుపలికారు. సీబీఐ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, దీనిపై అవసరమైతే రాజకీయ పోరాటం చేసుకోవాలని కోరారు.

jd 16112018 3

‘‘ప్రతిపక్ష నేత జగన్‌ పై దాడి కేసులో కోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుంది. సెక్షన్‌6లో ఉన్న నిబంధనలు కోర్టు ఉత్తర్వులకు వర్తించవు. కర్ణాటక మైనింగ్‌ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధారణ అనుమతిని రద్దు చేసింది. మళ్లీ తిరిగి అనుమతి ఇచ్చింది’’ అని లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్రానికి సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని చెప్తూనే, ఆ నిర్ణయం మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read