కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కట్టడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వేరే రాష్ట్రాల మద్దతు కూడా లభిస్తుంది. సిబిఐ వ్యవస్థ నాశనం చేసి, నిర్వీర్యం చేసి, తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న మోడీ-షాలకు చంద్రబాబు బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. ఆమె తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీబీఐని బీజేపీ నియంత్రిస్తోందని ఆరోపించారు.
అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. సీబీఐ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకుంటోందన్నారు. సీబీఐ చట్టాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రాల పరిథిలోని అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే పశ్చిమ బెంగాల్ కూడా సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు చాలా మంచి పని చేసారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ తన అధికారాలను, అధికార పరిథిని వినియోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సాధారణ సమ్మతిని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం ఉండదు. తాజాగా మమత బెనర్జీ కూడా చంద్రబాబు బాటలోనే సీబీఐని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని రాష్ట్రాలు ఇలా చేసే అవకాసం ఉందని తెలుస్తుంది.