కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారిన సీబీఐకు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం, ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఏపి ప్రభుత్వనికి భారత పౌరుడిగా వినతి పత్రం ఇచ్చానని విజయవాడకు చెందినా లాయర్ మీడియాతో చెప్పారు. భారత పౌరుడిగా, బెజవాడ న్యాయవాదిగానే సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చానని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ తెలియజేశారు. దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని, సీబీఐ ఆఫీసులో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు.

cbi 16112018 2

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల పై ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పోలీస్‌ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం సీబీఐకి అనుమతి నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు. కోర్టులూ కూడా కాదనలేవని, న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భారత పౌరుడిగా, బెజవాడ న్యాయవాదిగానే సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చానని ఆయన తెలియజేశారు. సీబీఐ కంటే ఏపీ ఏసీబీకే మంచి పేరు ఉందన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని తెలిపారు. ఏపీ ఏసీబీ పనితీరును సీబీఐ, ఐటీ కూడా ప్రశంసించాయని గుర్తుచేశారు.

cbi 16112018 3

ఏసీబీ నుంచి ఐటీ అధికారులు వివరాలు తీసుకున్న సందర్భాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై దర్యాప్తు చేసే సామర్ధ్యం ఏసీబీకి ఉందని చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యం కూడా ఏపీ ఏసీబీ సొంతమని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్‌ పేర్కొన్నారు. మరో పక్క, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని, సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ కూడా చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read