జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమరావతి పై, ప్రతి రోజు ఏదో ఒక కన్ఫ్యూషన్ ఉంటూనే ఉంది. ఎంత మంది, ఎన్ని మాట్లాడినా, మంత్రులు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నా, జగన్ మాత్రం, అమరావతి ఇక్కడే ఉంటుందని కాని, అమరావతి ఇక్కడ ఉండదు అని కానీ, ఏదీ క్లారిటీ ఇవ్వటం లేదు. మరో పక్క ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రకటనలతో, రాజధాని అమరావతి రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.భవిష్యత్తు ఏంటో అర్ధం కాక, ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియక, వారు ప్రతి రోజు ఆందోళనతో గడుపుతున్నారు. అయితే అమరావతి మార్చేస్తాం అని ప్రభుత్వంలోని మంత్రులు ఇస్తున్న లీకులుకు బలం చేకూరుస్తూ, ఇప్పుడు మరో పిడిగు లాంటి వార్త అమరావతి వాసులకు, అమరావతిని అభిమానించే వారికి, వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న మీడియాతో మాట్లాడుతూ, చేసిన వ్యాఖ్యలు, అమరావతి మార్పు పై సంకేతం ఇచ్చేలా ఉన్నాయి.

amaravati 18102019 2

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషమై, అధ్యయనానికే నిపుణుల కమిటీని నియమించామని బొత్సా చెప్పారు. ఈ కమిటి, రాష్ట్రమంతా తిరిగి, రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఏ ప్రాంతాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాల పై, రీసెర్చ్ చేసి, ఒక నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ కమిటీ మరో 3, 4 రోజుల్లో తన పని మొదలు పెడుతుందని, రాష్ట్రమంతా పర్యటన చేస్తుందని, బొత్సా చెప్పారు. కమిటీ సూచనలు, సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించి, ప్రజాభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వపరంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని పై నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పారు. హైకోర్ట్ విషయంలో కూడా, కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయని, రాయలసీమలో పెట్టాలని కొందరు, అమరావతిలోనే కొనసాగించాలని మరికొందరు, ఉత్తరాంధ్రలో పెట్టాలని ఇంకొందరు ఆందోళన చేస్తున్నారని, దీని పై కూడా ఈ కమిటి ఒక నిర్ణయం తీసుకుంటుందని బొత్సా చెప్పారు.

amaravati 18102019 3

శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా, చంద్రబాబు అమరావతిని ఫైనల్ చేసారని, అక్కడ రాజధాని ఏ విధంగా సౌకర్యంగా లేదని, ఇప్పుడు ఉన్న సచివాలయమున్న ప్రాంతం వర్షం పడితే ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ఒక భవనం నిర్మించాలి అంటే, ఇక్కడ చాలా ఖర్చు అవుతుందని బొత్సా అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటి అన్నిటినీ, ఆ కమిటి పరిశీలిస్తుందని, చెప్పారు. అయితే బొత్సా మాటలను ప్రకారం చూస్తుంటే, రాజధాని మార్పు తధ్యం అనే అనుమానాలు వస్తున్నాయి. రాజధానిని మార్చటం అంత తేలిక కాదని, మరో వాదన కూడా జరుగుతుంది. ఇదంతా సమస్యల నుంచి పక్క దోవ పట్టించి, ప్రజలను అసలు ఇబ్బందులు నుంచి డైవర్ట్ చెయ్యటానికి అనే వాదన కూడా వినిపిస్తుంది. చూద్దాం మరి జగన్ ఏమి చేస్తారో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read