టీవీ9 మాజీ సిఈవో రవి ప్రకాష్ కేసుల విషయంలో రోజుకి ఒక ట్విస్ట్ వస్తుంది. ఆయన్ను బయటకు తీసుకోవచ్చే ఉద్దేశం అక్కడ ప్రభుత్వ పెద్దలకు లేనట్టు ఉంది. టీవ9 చేతులు మారగానే, రవి ప్రకాష్ ను కొత్త యాజమాన్యం టార్గెట్ చేసింది. అయితే రవి ప్రకాష్ కోర్ట్ నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు. దీంతో పెద్దలు, ఈ కేసు విషయంలో రవి ప్రకాష్ ని అరెస్ట్ చెయ్యలేం అని తెలుసుకుని, మరో కేసు పెట్టారు. అంతే, ఉన్నట్టు ఉండి దసరా పండుగ రెండు రోజుల ముందు, పోలీసులు ఉన్న పళంగా వచ్చి, రవి ప్రకాష్ ని అరెస్ట్ చేసారు. ఏబీసీఎల్‌ ఖాతాల నుంచి రూ.18కోట్లు అక్రమంగా తీసుకున్నారన్న అభియోగాలపై రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసు విషయంలో రవి ప్రకాష్ బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై నిన్న వాదనలు జరిగాయి.

raviprakash 18102019 2

దీంతో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈకేసులో రవిప్రకాశ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం, రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసు విషయంలో రవి ప్రకాష్ కు బెయిల్ వస్తుందని, ముందే గ్రహించి, బెయిల్ వచ్చే లోపే మరో కేసు పెట్టారు. దీంతో రవి ప్రకాష్ కి బెయిల్ వచ్చిన వెంటనే, మరో కేసులో పోలీసులు అరెస్ట్ చూపించారు. నకిలీ మెయిల్‌ ఐడీ సృష్టించి మోసం చేశారని ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌ జైలు నుంచి విడుదలకాగానే ఈకేసులో ఆయన్ను విచారించే అవకాశముంది.

raviprakash 18102019 3

ఐ ల్యాబ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, ఈ కొత్త కేసు పెట్టి, రవిప్రకాశ్‌ పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66 డీ సెక‌్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. అయితే మరో పక్క, రవి ప్రకాష్ కేసు ఇన్ని ట్విస్ట్ లు తిరగటం వెనుక, రాజకీయ కోణం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. టీవీ9 కొత్త యాజమాన్యం, కేసిఆర్ కు సన్నిహితులు కావటమే, ఈ వాదనలకు బలం చేకూరింది. అయితే, రవి ప్రకాష్ ను అరెస్ట్ చేసిన వారం రోజులుకి, కేసిఆర్ సన్నిహితుడు అయిన మేఘా కృష్ణా రెడ్డి పై, ఆరు రోజుల పాటు ఐటి దాడులు జరగటం వెనుక ఉన్న మర్మం పై కూడా, ఆసక్తి నెలకొంది. ఈ దాడులు, రవి ప్రకాష్ ఇచ్చిన కంప్లైంట్ పైనే జరిగాయనే ప్రచారం కూడా ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read