జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న లాంగ్ మార్చ్ సందర్భంగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు. ఈ సమావేశంలో, ఆయన మాట్లాడుతూ, ఇసుక సమస్యని తీర్చండి అని చెప్తుంటే, వైసీపీ నాయకులు, వరుస పెట్టి తనని తిడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనని తిడితే లాభం లేదని, తనను తిడితే సమస్య పరిష్కారం అవ్వదని పవన్ కళ్యాణ్ అన్నారు. 40 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని, ఆ కష్టాలు ప్రభుత్వానికి చెప్పేందుకే విశాఖలో లాంగ్ మార్చ్ చేసామని, దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇసుక సమస్యని పరిష్కారం చెయ్యకుండా, తనని తిడితే, ఆ 40 లక్షల మందికి ఏమి ఒరగదని అన్నారు. వైసీపీ నేతల తీరు చూస్తుంటే, వారికి ఇసుక సమస్య పరిష్కారం చెయ్యాలనే ఆలోచన లేదని, వారు ఇసుకలో ఇంకా ఏదో బెనిఫిట్ కోసం చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇక వైసిపీ నేతలు తనని తిడటం పై, ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. జగన్ మోహన్ రెడ్డి పేపర్ పెట్టచ్చు, ఆయన మీడియాను నడపొచ్చు, భారతీ సిమెంట్స్ వ్యాపారం చెయ్యొచ్చు, అవంతి శ్రీనివాస్ విద్యాసంస్థలు నడపవచ్చు, అందరూ అన్ని వ్యాపారాలు చేసుకుంటూ, రాజకీయం చెయ్యొచ్చు, నేను మాత్రం సినిమాల నుంచి వస్తే తప్పా అని, వైసిపీ నేతలను, పవన్ కళ్యాణ్ నిలదీసారు. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిందని, నటిస్తానో లేదో కాని, సినిమా రంగంలో ఉంటానని, అలాగే ప్రజల సమస్యల పై పోరాడుతూనే ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ మాటల పై స్పందిస్తూ, తల్లో, తండ్రో, అన్నయ్యో ఎవరో ఒకరు పెంచితేనే పెద్ద అవుతామని పవన్ అన్నారు.
అవంతిలా తాను గడ్డంతోనే పుట్టలేదని ఎద్దేవాచేశారు. తాను అన్నయ్య దగ్గర పెరిగానని, సినిమాల్లో ఆక్టింగ్ నేనే చేసానని, అన్నయ్య వచ్చి చెయ్యలేదని పవన్ అన్నారు. మంత్రి కన్నబాబు విషయంలో కూడా, తాను ఏమి విమర్శలు చెయ్యలేదని, తాము రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వ్యక్తీ, కృతజ్ఞత ఉండాలని మాత్రమే తాను మాట్లాడానని చెప్పారు. అయితే ఈ సందర్భంలో, విలేఖరులు, అంబటి రాంబాబు చేసిన విమర్శలకు ఏమంటారని అడుగగా, పవన్ కళ్యాణ్ ఒక్క ముక్కలో అంబటిని తీసి పడేసారు. చివరకు అంబటి రాంబాబు లాంటి వారి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలా అని పవన్ నవ్వుకుంటూ లేచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం పై అంబటి ఎలా స్పందిస్తారో చూడాలి.